Sadabainama regularization | సాదాబైనామాలకు మోక్షం.. క్రమబద్ధీకరణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

admin

అక్షరటుడే, భీమ్​గల్ : Sadabainama regularization | తెల్ల కాగితాలపై రాసుకున్న భూముల ఒప్పందాల (సాదాబైనామా) క్రమబద్ధీకరణకు మోక్షం లభించనుంది. ప్రభుత్వం నిబంధనలు సవరించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జిల్లాలో ఏళ్లుగా పెండింగ్​లో ఉన్న దరఖాస్తులు క్లియర్​ కానున్నాయి. హక్కుల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు ప్రభుత్వ తాజా నిర్ణయంతో పట్టాలు అందనున్నాయి. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో జిల్లా రెవెన్యూ యంత్రాంగంలో కదలిక మొదలైంది.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 జూన్ 2వ తేదీకి ముందు జరిగిన సాదాబైనామా కొనుగోళ్లకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో 2016, 2020లలో దరఖాస్తులు స్వీకరించినప్పటికీ, వివిధ కారణాల వల్ల ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది. నిజామాబాద్ జిల్లాలో వేలాది మంది రైతులు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నప్పటికీ, విచారణలో జాప్యం, అమ్మిన వారు ముందుకు రాకపోవడం వంటి కారణాలతో పట్టాలు జారీ కాలేదు. ప్రస్తుతం ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను క్లియర్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

జిల్లాలో దరఖాస్తులు

మండలం దరఖాస్తులు:

నిజామాబాద్ రూరల్ 315

డిచ్‌పల్లి 158

ఆర్మూర్ 280

నవీపేట 142

బోధన్ 340

సిరికొండ 195

భీమ్​గల్ 210

జక్రాన్‌పల్లి 85

ఎడపల్లి 125

మాక్లూర్ 160

ముప్కాల్ 92

బాల్కొండ 178

Sadabainama regularization | క్షేత్రస్థాయి విచారణే కీలకం

సాదాబైనామా కోసం వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టనున్నారు. అర్హులకు న్యాయం జరిగేలా పంచనామా నిర్వహించనున్నారు. తహశీల్దార్ ద్వారా నివేదికలు ఆర్డీవోకు పంపించాల్సి ఉంటుంది. ఆర్డీవో ఆమోదంతో దరఖాస్తుదారులకు డిజిటల్ పట్టాలు జారీ అవుతాయి. కనీసం పన్నెండేళ్లకు పైగా భూమి స్వాధీనంలో ఉంటే విక్రయదారుడి అఫిడవిట్ అవసరం లేకుండానే కొనుగోలుదారుడి స్వీయ ధ్రువీకరణతో పట్టా ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.

Sadabainama regularization | నిరాకరించడంతో..

భూముల ధరల పెరుగుదల కారణంగా అమ్మినవారు రిజిస్ట్రేషన్‌కు సహకరించక పోవడంతో వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయి. ఇప్పుడు ప్రభుత్వం సరళీకృతం చేసిన నిబంధనలతో ఈ సమస్యలన్నీ తొలగిపోతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పట్టాల పంపిణీ చేయాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది.

ఇది కూడా చదవండి..: Ponnam Prabhakar | దేశంలో నియంతృత్వానికి తావులేదు : మంత్రి పొన్నం ప్రభాకర్​

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *