Supreme Court Footpath | ఆ నడక ప్రాథమిక హక్కు..ప్రతి రోడ్డుపై ఫుట్‌పాత్‌లను డీమార్క్ చేయాలి : సుప్రీంకోర్టు

ఈ కేసులో పరిహారం కోరుతూ దాఖలైన అప్పీల్‌ను విచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Supreme Court Footpath | దేశంలోని ప్రతి రోడ్డుపై పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లను తప్పనిసరిగా డీమార్క్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, దీనిపై సంబంధిత అధికారులకు తగిన సూచనలు జారీ చేయాలని అదనపు సొలిసిటర్ జనరల్ (ASG)కు సూచించింది. ఈ మేరకు చర్యల పురోగతిని తెలియజేయడానికి రెండు వారాల గడువు ఇస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

Bigg Boss 10 Agni Pariksha | బిగ్‌బాస్-10కు రంగం సిద్ధం..ఆగస్టు 15 న అగ్నిపరీక్ష ప్రారంభం

Supreme Court Footpath | బాలుడి మృతి కేసు విచారణలో..

కర్ణాటకలో తండ్రితో కలిసి నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తున్న ఓ బాలుడు ట్యాంకర్ ఢీకొని మృతి చెందాడు. కాగా, ఈ కేసులో పరిహారం కోరుతూ దాఖలైన అప్పీల్‌ను విచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పాదచారులు ఫుట్‌పాత్‌పై సురక్షితంగా నడిచే హక్కు భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో భాగమని కోర్టు మరోసారి స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా పాదచారుల భద్రతకు ప్రాధాన్యం కల్పించేలా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *