అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rahul Gandhi Debate | విద్యార్థుల నిరసనల అంశంపై చర్చకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రతిపక్షాలు చర్చకు వెనకాడుతున్నాయని ఎన్డీఏ ఎంపీలు ఆరోపించారు. ఈ మేరకు పార్లమెంట్ ఆవరణలో ర్యాలీ నిర్వహించారు.
బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. జార్ఖండ్ యువతకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. వారిపై జరిగిన లాఠీచార్జీలు, అరాచకాలు రాహుల్ గాంధీ మనస్తత్వాన్ని బయటపెట్టాయన్నారు. ఆయన మద్దతుదారులు పాలించే రాష్ట్రంలో యువత పట్ల ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో, వారికి ఎలా న్యాయం నిరాకరించబడుతోందో ఇది చూపిస్తుందన్నారు. మరోవైపు స్వయంగా సభకు హాజరుకాని రాహుల్ గాంధీ హోం మంత్రిని సమాధానాలు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.
Rahul Gandhi Debate | చర్చకు సిద్ధంగా ఉన్నాం
బీజేపీ ఎంపీ అరుణ్ గోవిల్ మాట్లాడుతూ.. తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కానీ ప్రతిపక్ష ఎంపీలు దాని నుండి పారిపోతున్నారని విమర్శించారు. ప్రతిపక్షం చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఎంపీ తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. జార్ఖండ్‌లో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీపై రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీ మనోజ్ తివారీ మాట్లాడుతూ.. అమిత్ షా సమాధానం ఇస్తారని, రాహుల్ గాంధీ పారిపోవద్దని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: FCRA Bills | నీట్, ఎఫ్సీఆర్ఏ బిల్లులకు వ్యతిరేకంగా తీర్మానం