PDS Rice Seized | అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం సీజ్

నందిపేట మండల పరిధిలోని ఆంధ్రనగర్ నుంచి అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని పట్టుకున్నట్లు నందిపేట ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.

shashi kiran Mottala

అక్షర్ టుడే, నందిపేట్: PDS Rice Seized | నందిపేట మండల (Nandipet Mandal) పరిధిలోని ఆంధ్రనగర్ నుంచి అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని పట్టుకున్నట్లు నందిపేట ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం రాత్రి సమాచారం వెల్లడించారు.

PDS Rice Seized | విశ్వసనీయ సమాచారం మేరకు..

​విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన తనిఖీల్లో ఆంధ్రనగర్ వద్ద ఒక బొలెరో వాహనాన్ని నిలిపి తనిఖీ చేయగా, అందులో ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 51 బ్యాగులలోని 31 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యాన్ని, వాహనాన్ని నందిపేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వాహన డ్రైవర్ కలీంతో పాటు, మాక్లూర్ గ్రామానికి చెందిన వాహన యజమాని ఇమ్రాన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్ కుమార్ వెల్లడించారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Drone Surveillance | డ్రోన్‌ నిఘా.. అనుమానాస్పద ప్రాంతాలపై పోలీసుల ప్రత్యేక దృష్టి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *