అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nizamabad Drone Surveillance | నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీలో పోలీసులు Police డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కాలనీలోని అనుమానాస్పద ప్రాంతాలతో పాటు లైబ్రరీ, ప్లేగ్రౌండ్ తదితర ప్రదేశాల్లో డ్రోన్ ద్వారా పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
Nizamabad Drone Surveillance | స్టేషన్ నుంచే ఆపరేటింగ్..
పోలీస్ స్టేషన్ నుంచే డ్రోన్‌ను ఆపరేట్ చేస్తూ పరిసర ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా పోలీసుల నిఘాకు దూరంగా ఉండే నిర్మానుష్య ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.
delhi-nakili-call | ఢిల్లీ కేంద్రంగా నకిలీ కాల్ సెంటర్ల మోసం.. 21 మంది తెలంగాణ వాసుల అరెస్టు
డ్రోన్ కెమెరా సహాయంతో అనుమానాస్పద ప్రదేశాలను పరిశీలిస్తున్నామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసుల పర్యవేక్షణను మరింత విస్తృతం చేస్తున్నామని సీఐ తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని స్థానికులకు సూచించారు.