Bengal BJP | బెంగాల్​లో బీజేపీ మరో బంపర్​ విక్టరీ.. ఫాల్టా రీపోలింగ్​లో కమలం అభ్యర్థి గెలుపు..

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Bengal BJP | పశ్చిమ బెంగాల్​లో బీజేపీ మరో బంపర్​ విక్టరీ సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి దేబాంగ్షు పాండా ఘనవిజయంతో సంచలనం సృష్టించాడు. ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిని రీపోలింగ్​లో దేబాంగ్షు పాండా.. సీపీఎం అభ్యర్థి శంభు నాథ్ కుర్మిపై 1,09,021 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

Bengal BJP | భారీ మెజారిటీ..

ఫాల్టా నియోజకవర్గంలో ఏప్రిల్ 29న జరిగిన పోలింగ్ సందర్భంగా అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో రీపోలింగ్​ నిర్వహించారు. మొత్తం 285 పోలింగ్ కేంద్రాలలో తిరిగి పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఇటీవల రీపోలింగ్​ నిర్వహించారు. తుది లెక్కల ప్రకారం.. బీజేపీ అభ్యర్థి పాండా 1,49,666 ఓట్లు సాధించగా, సీఎం అభ్యర్థి కుర్మి 40,645 ఓట్లు పొందారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుర్ రజాక్ మొల్లా 10,084 ఓట్లు పొందగా, అంతకుముందే పోటీ నుంచి వైదొలిగిన టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ 7,783 ఓట్లు సాధించారు.

Bengal BJP | వైదొలిగిన టీఎంసీ అభ్యర్థి

ఫాల్టా అసెంబ్లీ నియోజవర్గంలో ఇటీవల రీపోలింగ్​ నిర్వహించారు. అయితే పోలింగ్​కు రెండు రోజుల ముందు టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ బరిలో నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఇది రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఎన్నికల్లో ఆయన తప్పుకోవడంతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.

ఇది కూడా చదవండి..: Udhayanidhi Stalin | పదవుల కోసం వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్​ : ఉదయనిధి స్టాలిన్​

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *