SBI Bank Robbery | ఎస్బీఐలో భారీ దోపిడీ.. తుపాకీతో బెదిరించి రూ. 50 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు!

Shivam nagarani

అక్షరటుడే, సూరత్: SBI Bank Robbery | గుజరాత్‌ (Gujarat)లోని సూరత్‌లో దుండగులు బరితెగించారు. వరాచా ప్రాంతంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) శాఖలో పట్టపగలే తుపాకులతో చొరబడి బీభత్సం సృష్టించారు.సినిమా పద్ధతిలో బ్యాంకు సిబ్బందిని, ఖాతాదారులను బెదిరించి సుమారు రూ. 50 లక్షల నగదును దోచుకెళ్లారు.

SBI Bank Robbery | అలారం కట్ చేసి, ఫోన్లు లాక్కొని:

దొంగతనం కోసం దుండగులు పక్కా ప్లాన్‌తో వచ్చినట్లు తెలుస్తోంది. బ్యాంకులోకి ప్రవేశించగానే వారు చేసిన మొదటి పని అలారం వ్యవస్థను నిర్వీర్యం చేయడం. ఎవరూ బయట ప్రపంచానికి సమాచారం అందించకుండా ఉండేందుకు, అక్కడున్న వారి మొబైల్ ఫోన్లను బలవంతంగా లాక్కొని ఒకచోట పడేశారు. అనంతరం తుపాకులతో బెదిరించి క్యాష్ కౌంటర్లోని నగదును బ్యాగుల్లో నింపుకుని అక్కడి నుంచి పరారయ్యారు.

SBI Bank Robbery | పోలీసుల గాలింపు:

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బ్యాంకులోని సిసిటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. నగరం వెలుపలికి వెళ్లే అన్ని మార్గాల్లో దిగ్బంధనం చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు. పట్టపగలే రద్దీగా ఉండే ప్రాంతంలో ఇంత పెద్ద దోపిడీ జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

ఇది కూడా చదవండి..: Digital Arrest Scams | డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లకు కేంద్రం చెక్.. ఇక సైబర్ మోసగాళ్లకు చుక్కలే!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *