DMK Congress Rift | డీఎంకే, కాంగ్రెస్ మధ్య పెరుగుతున్న దూరం.. సీజేపీకి స్టాలిన్ మద్దతు

తమిళనాడు రాజకీయాల్లో అధికార డీఎంకే (DMK) , కాంగ్రెస్ పార్టీల మధ్య సంబంధాలు క్రమంగా బలహీనపడుతున్నాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: DMK Congress Rift | తమిళనాడు రాజకీయాల్లో అధికార డీఎంకే (DMK) , కాంగ్రెస్ పార్టీల మధ్య సంబంధాలు క్రమంగా బలహీనపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమిగా పోటీ చేసినప్పటికీ, విజయ్ పార్టీ (TVK) విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయ్ వైపు వెళ్లడం డీఎంకేను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఈ పరిణామాన్ని డీఎంకే వర్గాలు “వెన్నుపోటు”గా అభివర్ణిస్తున్నాయి.

DMK Congress Rift | కాంగ్రెస్‌కు కటీఫ్..

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండాలని డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన పార్టీ శ్రేణులకు స్పష్టం చేసినట్లు సమాచారం. చెన్నైలో జరిగిన పార్టీ ఎంపీల సమావేశంలో స్టాలిన్ ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఐఆర్ (SIR) విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని డీఎంకే ఆరోపిస్తోంది. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పోరాడుతున్న కాంగ్రెస్‌కు దూరంగా ఉంటూనే, తాజాగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP)కి డీఎంకే మద్దతు ప్రకటించడం గమనార్హం.

DMK Congress Rift | స్టాలిన్ ఆగ్రహం..

సీజేపీ అధినేత అభిజిత్ దీప్కే, కో కన్వీనర్లు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ , నేహా బోరాల నిర్బంధాన్ని స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వ అణచివేత చర్యలకు వ్యతిరేకంగా నిరసనలను మరింత ఉద్ధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా ‘ఎక్స్’ వేదికగా వరుస పోస్టులు పెడుతున్నారు. త్వరలోనే అభిజిత్ దీప్కేను స్టాలిన్ స్వయంగా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

DMK Congress Rift | థర్డ్ ఫ్రంట్ దిశగా …

మరోవైపు, కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ (INDIA) కూటమికి దూరంగా జరుగుతున్న డీఎంకే.. జాతీయ స్థాయిలో ‘థర్డ్ ఫ్రంట్’ (మూడవ కూటమి) ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే డీఎంకే ఎంపీ కనిమొళి ఇటీవల శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (NCP) , టీఎంసీ (TMC) పార్టీల నేతలతో సమావేశమయ్యారు. భవిష్యత్తులో ఈ థర్డ్ ఫ్రంట్‌లోకి సీజేపీని కూడా ఆహ్వానిస్తారనే ప్రచారం జరుగుతోంది. విశేషమేమిటంటే, తమిళనాడులో విజయం సాధించిన విజయ్ పార్టీ (TVK) , డీఎంకే రెండు కూడా ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్‌ను ఒకేలా వ్యతిరేకిస్తుండటం ప్రస్తుత రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

ఇది కూడా చదవండి:  Nizamabad Police | కాపురానికి రావట్లేదని భార్యపై దాడి..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *