అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad Police | కాపురానికి రావట్లేదని భార్య దాడి చేశాడు. అంతేకాదు మామపై కూడా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన నగరంలోని (Nizamabad) వినాయక్‌నగర్ (Vinayak nagar)లో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
Nizamabad Police | వినాయక్‌నగర్‌లో..
నాల్గో టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన మధుకర్‌కు నగరంలోని వినాయక్‌నగర్‌కు చెందిన మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె తిరిగి వినాయక్‌నగర్‌లోని తన పుట్టింట్లోనే ఉంటోంది.
ఈ క్రమంలో శుక్రవారం ఆమె ఇంటికి వచ్చిన భర్త మధుకర్ కాపురానికి రావాలని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తుడైన మధుకర్ కత్తితో భార్య, మామపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో ఇరువురికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు వారిని జీజీహెచ్‌కు తరలించారు. సమాచారం అందుకున్న నాల్గో టౌన్ ఎస్‌హెచ్‌వో సతీష్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రస్తుతం మామ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
ఇది కూడా చదవండి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఐస్ బాత్