Kamareddy Dasara Celebrations | దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు : షబ్బీర్ అలీ

ఐదేళ్ల తర్వాత ఇందిరాగాంధీ స్టేడియంలో దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు షబ్బీర్ అలీ తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Dasara Celebrations | ఐదేళ్ల తర్వాత ఇందిరాగాంధీ స్టేడియంలో దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. శనివారం ఆయన స్టేడియంలో జరుగుతున్న దసరా ఉత్సవ పనులను పరిశీలించారు.

Kamareddy Dasara Celebrations | 40ఏళ్ల క్రితం ప్రారంభం..

షబ్బీర్​ అలీ (Shabbir Ali) మాట్లాడుతూ 40 ఏళ్ల క్రితం దసరా ఉత్సవ కమిటీ నిర్వాహకులు వీటీ ఠాకూర్ ఆధ్వర్యంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయన్నారు. 1990లో తాను మంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారి ఉత్సవాలను ప్రారంభించానన్నారు. ఆ తర్వాత షబ్బీర్ అలీ ఫౌండేషన్, దసరా ఉత్సవ కమిటీ సంయుక్తంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గత ఐదేళ్ల క్రితం కరోనా కారణంగా ఉత్సవాలు నిలిచిపోయాయని, ఉత్సవాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఈ సంవత్సరం స్టేడియంలో అంగరంగ వైభవంగా ఉత్సవాలకు ఏర్పాటు చేస్తున్నామని, అబ్బురపరిచే విధంగా లేజర్ షో ఉంటుందన్నారు.

Kamareddy Dasara Celebrations | స్టేడియంలో మరమ్మతులు..

గత కొన్నాళ్లుగా స్టేడియంలో వసతులు అధ్వానంగా తయారయ్యాయని, రూ.15 లక్షల వ్యయంతో మరమ్మతులు చేశామని షబ్బీర్​ అలీ తెలిపారు. ఎంఎస్ఎన్ కంపెనీ సహకారంతో సీఎస్ఆర్ నిధులు కలిపి దాదాపు రూ.కోటి వ్యయంతో స్టేడియంలో ఫ్లడ్ లైట్స్, ఇతర వసతులు కల్పిస్తున్నట్టు తెలిపారు. దసరా రోజు జరిగే ఉత్సవాలకు పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఇతర నాయకులకు ఆహ్వానిస్తామని చెప్పారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మున్సిపల్, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ, ఫైర్ శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా టపాకులు కాల్చే సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు శాఖ బారికేడ్లు ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రజలు పెద్దఎత్తున పాల్గొని ఉత్సవాలను వీక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నిర్వాహకుడు వీటీ రాజ్ కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ గిరి, డీఎస్పీ మధుసూదన్, జిల్లా స్పోర్ట్స్ అధికారి వెంకట్, డీఎంఅండ్​హెచ్​వో వెంకట్, నాయకులు గూడెం శ్రీనివాస్ రెడ్డి, కైలాస్ శ్రీనివాస్ రావు, ఇప్ప శ్రీనివాస్, ఐరేని సందీప్, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: ABPS National President | మానవత్వం, సోదరభావంతోనే ఐక్యత : ఏబీపీఎస్ జాతీయ అధ్యక్షుడు ప్రబోధ్ సుమేర్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *