అక్షరటుడే, భీమ్గల్: ABPS National President | కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా ఉంటూ మానవత్వం, సోదరభావానికి ప్రాధాన్యమివ్వాలని ఆల్ బ్రాహ్మణ ప్రోగ్రెస్సివ్ సొసైటీ (ఏబీపీఎస్) జాతీయ అధ్యక్షుడు ప్రబోధ్ సుమేర్ సూచించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
ABPS National President | భీమ్గల్ పట్టణంలో..
దేవీ శరన్నవరాత్రులు, బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా భీమ్గల్ మండల (Bheemgal Mandal) ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటేనని, పరస్పర గౌరవం, ప్రేమ, నైతిక విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పండుగలు కేవలం ఆచారాలకే పరిమితం కాకుండా ప్రజల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందించేలా ఉండాలని ఆకాంక్షించారు.
ABPS National President | రైతుల సంక్షేమమే ముఖ్యం
భీమ్గల్ ప్రాంతంలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారమని, వర్షాభావ పరిస్థితులతో రైతులు సాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రబోధ్ సుమేర్ ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి దుర్గమ్మ కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించాలని, చెరువులు, కుంటలు నిండి రైతుల కష్టాలు తొలగిపోవాలని ప్రార్థించారు. పంటలు బాగా పండి ప్రతి రైతు కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలని కోరారు.
ఇది కూడా చదవండి..: Madiga Employees Union | మాదిగ ఉద్యోగుల సమైక్య జిల్లా కమిటీ ఎన్నిక