అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Madiga Employees Union | మాదిగ ఉద్యోగుల సమైక్య జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. నగరం (Nizamabad)లోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో ఈ కార్యక్రమం నిర్వహించారు.
Madiga Employees Union | నూతన కార్యవర్గమిదే..
అధ్యక్షుడిగా సైదు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శిగా జి. సాయిలు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎస్.మారుతి, కోశాధికారిగా బి.సహదేవ్, అడిషనల్ జనరల్ సెక్రెటరీ నాగనాథ్ ఎన్నికయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాదిగ ఉద్యోగుల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు చేపర్తి యాదగిరి, విశిష్ట అతిథులుగా ఎంఈఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు సిలుమాల సురేష్, మాదిగ ఉద్యోగుల సమైక్య జాతీయ కోర్ కమిటీ సభ్యులు రేణిగుంట నాంపల్లి, తెడ్డు గంగారం, స్టేట్ ఆర్గనైసింగ్ సెక్రెటరి మారుతి పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Roads | వామ్మో రోడ్లు.. పదేళ్ల కామారెడ్డి పరిస్థితి ఇంత అధ్వానమా..?