Car Racing Accident | మహిళ ప్రాణాలు తీసిన యువకుల కారు రేసింగ్​

కారు రేసింగ్​ చేస్తూ యువకులు ఓ బైక్​ను ఢీకొట్టడంతో మహిళ మృతి చెందింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Car Racing Accident | యువకుల కారు రేసింగ్​ సరదా ఓ కుటుంబాన్ని రోడ్డు పడేసింది. అతివేగంగా, నిర్లక్ష్యంగా కార్లు నడుపుతూ.. బైక్​ను ఢీకొట్టడంతో మహిళ మృతి చెందింది. ఆమె భర్తకు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన మహబూబ్​నగర్​ జిల్లా (Mahabubnagar District)లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్​కు చెందిన షాకీర్, భార్య షహానా బేగం, కూతురు ఆయారాతో కలిసి బైక్​పై వెళ్తున్నాడు. అయితే అదే సమయంలో కొందరు యువకులు థార్​ కార్లతో రోడ్డుపై రేసింగ్​ చేస్తున్నారు. అమిస్తాపూర్ యూపీఎస్ స్కూల్ వద్ద వారి కార్లు ఒకదాని తర్వాత ఒకటి బైక్​ను ఢీకొట్టాయి. దీంతో షహానా బేగం తీవ్రంగా గాయపడిన అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త షాకీర్​కాళ్లు చేతులు విరగడంతో పరిస్థితి విషమంగా ఉంది. చిన్నారి ఆయారా స్వల్ప గాయాలతో బయటపడింది.

Car Racing Accident | పట్టుకున్న స్థానికులు

రెండు కార్లు బైక్​ను ఢీకొట్టిన తర్వాత వేగంగా దూసుకెళ్లాయి. గమనించిన స్థానికులు వెంబడించి ఒక కారును పట్టుకున్నారు. మరో కారు వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారును అందులోని విద్యార్థులను స్టేషన్​ను తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇటీవల కొందరు యువకులు, విద్యార్థులు రోడ్లపై ప్రమాదకరంగా స్టంట్లు చేస్తున్నారు. రేసింగ్​లకు పాల్పడుతూ ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. రీల్స్​ కోసం కార్లు, బైక్​లపై అతివేగంగా దూసుకెళ్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: Rain Alert | రైతులకు అలర్ట్​.. నేటి నుంచి వర్షాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *