అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bandi Sanjay Counter | కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్‌లా దోచుకోవడం తనకు తెలియదన్నారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రధాని మోదీ (PM Modi) ఈ నెల 10న హైదరాబాద్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ (RTC X Roads) నుంచి అంబర్‌పేట వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న బండి సంజయ్ మాట్లాడుతూ.. కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. ‘‘బండి సంజయ్ కేంద్ర మంత్రి ఐన రెండున్నరేళ్లలో రాష్ట్రానికి ఒక్క మంచి పని అయినా చేశాడా? ఒక్క గుడి కట్టిండా? ఒక్క బడి కట్టిండా?” అని కేటీఆర్ ప్రశ్నించిన విషయం తెలిసిందే.
Bandi Sanjay Counter | డ్రగ్స్ తీసుకోవడం తెలియదు
బండి సంజయ్ మాట్లాడుతూ.. రైతులకు బేడీలు వేసి అరిగోస పెట్టడం తనకు తెలియదన్నారు. మీలా డ్రగ్స్ తీసుకోవడం తెలియదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం, ఈ-ఫార్ములా, విద్యుత్ కొనుగోళ్లలో.. అవినీతి చేయడం తెలియదని విమర్శించారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. కేటీఆర్ అహంకారం వల్లే KCR ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యారని పేర్కొన్నారు. ఏం చేసినా BRS మళ్లీ అధికారంలోకి రాదన్నారు.
Bandi Sanjay Counter | కేంద్రం నుంచి నిధులు
రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ. వేల కోట్ల నిధులు ఇస్తుందని బండి సంజయ్ తెలిపారు. కేంద్రం నుంచి తాము నిధులు తెస్తుంటే, కాంగ్రెస్ నాయకులు తెలంగాణ సొమ్మును ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు పంపుతున్నారని ఆరోపించారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. కేటీఆర్‌ను చూసి ఆ పార్టీ కార్యకర్తలే అసహ్యించుకుంటున్నారని విమర్శించారు.
దీనిని కూడా చదవండి : Paddy Procurement Delay| ధాన్యం తడిశాక ఎందుకొచ్చావ్? మంత్రి అడ్లూరిపై రైతుల ఫైర్

