అక్షరటుడే, వెబ్డెస్క్ : Panipuri Food Poisoning | సిరిసిల్ల జిల్లా (Sircilla District)లోపానీపూరి తిని 20 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కేసీఆర్ నగర్ కాలనీ (KCR Nagar Colony)లో ఒక బండి వద్ద పానీపూరి తిన్న చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, తీవ్రమైన జ్వరం లాంటి లక్షణాలు కనిపించడంతో తల్లిదండ్రులు వారిని ఆస్పత్రికి తరలించారు. ఇంతమంది పిల్లలు అనారోగ్యంబారిన పడటంతో కాలనీలో తీవ్ర కలకలం రేగింది.
Panipuri Food Poisoning | బాలుడి పరిస్థితి విషమం
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల్లో రిషికేష్ అనే బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాలుడికి తీవ్ర స్థాయిలో జ్వరం రావడంతో ఫిట్స్ వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తన నలుగురు పిల్లల్లో ముగ్గురు పానీపూరి తిని అస్వస్థతకు గురైనట్లు ఓ మహిళా ఆవేదన వ్యక్తం చేసింది. అస్వస్థతకు గురైన మిగతా చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Panipuri Food Poisoning | ఏం తినాలన్న భయం
ప్రస్తుతం బయట ఆహారం తినాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల హైదరాబాద్లో మామిడిపండ్లు తిని ఇద్దరు అక్కాచల్లెళ్లు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా పానీపూరి తిని 20 మంది చిన్నారులు అస్వస్థతకు గురి అయ్యారు. గతంలో సైతం ఇలాంటి ఘటనలు అనేకం వెలుగు చూశాయి. ఈ క్రమంలో బయటి ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Ponnam on SIR | అర్హుల ఓటు హక్కు తొలగించకుండా చూడాలి : మంత్రి పొన్నం