అక్షరటుడే, వెబ్‌డెస్క్: VIP Security Reduction | రాష్ట్ర ప్రభుత్వం (State Government) కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో మావోయిస్టుల ముప్పు దాదాపు తొలగిపోవడంతో భద్రతా సమీక్ష కమిటీ నిర్ణయం మేరకు 100 మందికి పైగా వీఐపీల సెక్యూరిటీని జులై 1 నుంచి తగ్గించనుంది.
దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఉనికి దాదాపుగా కనుమరుగు అయింది. ఆపరేషన్ కగార్ (Operation Kagar)తో చాలా మంది ఎన్కౌంటర్లలో చనిపోయారు. వందలాది మంది పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. మావోయిస్ట్ పార్టీ సెక్రెటరీ దేవ్‌జీ సైతం లొంగిపోయారు. దీంతో దేశంతో పాటు రాష్ట్రంలో మావోయిస్టుల ముప్పు తొలగిపోయింది. ఈ క్రమంలో వీఐపీల భద్రతను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
VIP Security Reduction | ఖర్చు తగ్గింపు కోసం..
ప్రస్తుతం 600 మంది వీఐపీలకు రక్షణ ఉండగా, గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల నేతలు, మాజీ పోలీసు అధికారులకు బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు, గన్‌మెన్లను ఉపసంహరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అత్యున్నత భద్రతా సమీక్ష కమిటీ (సెక్యూరిటీ రివ్యూ కమిటీ) సూచనల మేరకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త నిర్ణయం వచ్చే నెల 1 నుంచి అమలులోకి రానుంది. దీంతో ప్రభుత్వానికి సైతం ఖర్చు తగ్గనుంది. రాష్ట్రవ్యాప్తంగా 100 మందికి పైగా ప్రముఖుల భద్రతను భారీగా తగ్గించినట్లు సమాచారం.
మావోయిస్టుల ఏరివేత కోసం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన గ్రేహౌండ్స్‌ను సైతం మూసి వేస్తున్నట్లు ఇటీవల డీజీపీ ఆనంద్ తెలిపిన విషయం తెలిసిందే. అందులోని సిబ్బందిని ఇతర విభాగాల్లోకి పంపిస్తామన్నారు. గతంలో మావోయిస్టుల ముప్పు అధికంగా ఉన్న ప్రాంతాల్లోని నాయకులకు ఉన్న భద్రతను తాజాగా తగ్గించనున్నారు. ఈ నిర్ణయం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని ప్రభుత్వం చెబుతోంది.
ఇది కూడా చదవండి..: Donald Trump Avenue | భారత్‌కు ట్రంప్ కృతజ్ఞతలు.. ఎందుకో తెలుసా?