Indiramma Houses | హైదరాబాద్​లో ఇందిరమ్మ ఇళ్లకు 35 వేల దరఖాస్తులు

క్యూర్​ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం మంచి స్పందన వస్తోంది. ఇప్పటి వరకు 35 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indiramma Houses | హైదరాబాద్ (Hyderabad)​ నగరం (క్యూర్​ పరిధిలో) ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. తొలి విడతలో నియోజకవర్గానికి 500 ఇళ్లు ఇస్తామని తెలిపింది. ఇందిరమ్మ టవర్స్ (Indiramma Towers)​ నిర్మించి ఇళ్లు పంపిణీ చేస్తామని తెలిపింది. దీని కోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

ఈ పథకం కింద మొత్తం ఒక లక్ష ఇండ్లను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించిన సంగతి తెలిసిందే. పైలట్ ప్రాజెక్టుగా ప్రతి నియోజకవర్గంలోనూ 500 ఇండ్ల చొప్పున నిర్మాణాలను చేపడుతున్నారు. ఇందులో భాగంగా 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న 7,340 ఇండ్ల కోసం డిమాండ్ సర్వే ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. శనివారం నాటికి 35,125 దరఖాస్తులు వచ్చాయని, ఈ నెల పదో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి. గౌతం ఒక ప్రకటనలో తెలిపారు.

 Indiramma Houses | 20 తరువాత లాటరీ

లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఆగస్టు 20 తర్వాత ఇందిరమ్మ ఇళ్ల కోసం లాటరీ తీయనున్నారు. అనంతరం ఇళ్లు వచ్చిన వారికి ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేసి అప్పగించనున్నారు. బహిరంగ మార్కెట్​లో రూ.30 లక్షల నుంచి రూ.58 లక్షల వలకు ధర పలికే ఈ ఫ్లాట్లను ప్రజల సంక్షేమం కోసం వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచాలన్న ఉద్దేశ్యంతో కేవలం 6 లక్షల రూపాయలకే ప్రభుత్వం కేటాయిస్తోంది. దరఖాస్తు సమయంలో రూ.10 వేలు ఈఎండీ చెల్లించాలి. ఒకవేళ ఇల్లు రాకపోతే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. ఇందిరమ్మ టవర్స్​కు సంబంధించి ఎటువంటి సందేహాలున్న 040-24603572 ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

దీనిని కూడా చదవండి : Bike Theft Gang | అంతర్ జిల్లా బైక్ దొంగల ముఠా అరెస్ట్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *