అక్షరటుడే, డిచ్పల్లి: Jana Sena Telangana | తెలంగాణ(Telangana) రాష్ట్రంలో జనసేన పార్టీ ప్రభంజనం మొదలైందని, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను( Pawan Kalyan) చూస్తే ఇతర పార్టీల నాయకులకు వణుకు పట్టుకుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రతినిధులు అన్నారు. డిచ్పల్లి (Dichpally) మండలం బర్దిపూర్ శివారులోని సుగుణ గార్డెన్లో జనసేన పార్టీ నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు.
Jana Sena Telangana | మీసాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో..
ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మీసాల శ్రీనివాస్ అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మొదట నిజామాబాద్ నుంచి బైపాస్ రోడ్డు మీదుగా పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించి సభ వేదికకు చేరుకున్నారు. జ్యోతి వెలిగించి ఆత్మీయ సమావేశం ప్రారంభించారు. జనసేన రాష్ట్ర ప్రతినిధి శంకర్ మాట్లాడుతూ.. భారతీయతను ముందుకు తీసుకెళ్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోందన్నారు. నాయకుడికి ప్రాంతీయత అంటగట్టడం తగదని, మనం భారతీయులని గుర్తుంచుకోవాలన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనను చూశామని, ఇక జనసేనను ఆదరించాలని కోరారు. పవన్ కళ్యాణ్ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ తెలంగాణ ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ మీటింగ్ పెట్టుకోవాలని చూస్తే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించడం తగదన్నారు.
Jana Sena Telangana | రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు అయినా..
తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 ఏళ్లు గడుస్తున్నా ఇంకా రోడ్లు బాగుపడకపోవడం బాధకరమని ఆర్కే సాగర్ అన్నారు. ఇంకా రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్తున్నారంటే నాయకులు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్, జనసేన భావజాలం నచ్చి అనేకమంది పార్టీలో చేరడం ఆనందంగా ఉంటుందన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో జనసేన జెండా ఎగరేసేందుకు జనసైనికులు సిద్ధం కావాలాన్నారు. పార్టీ రాష్ట్ర నాయకుడు మీసాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. జీవితాంతం జనసేనతోనే ఉంటానన్నారు. జిల్లాలో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ, జక్రాన్ పల్లిలో ఎయిర్ పోర్టు సాధన కోసం జనసేన పోరాటం చేస్తుందని ప్రకటించారు. పవన్ కళ్యాణ్‌ను దుషిస్తున్న కాంగ్రెస్ నాయకుల భరతం పడతామని హెచ్చరించారు. సినీ నటుడు తనీష్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్లేందుకు నిజామాబాద్ గడ్డ నుంచి జన సైనికులు సిద్ధం కావాలని సూచించారు. సామాన్యుడి గొంతు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జనసేన పార్టీ తెలంగాణలో అవసరం అని చెప్పాలన్నారు. రాష్ట్ర నాయకులు మచ్చ శ్రీనివాస్, దామోదర్ రెడ్డి, సురేష్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. ఆయా నియోజకవర్గాల నాయకులు జనార్ధన్, నర్సాగౌడ్, రజని తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Kacheguda Bus Terminal | హైదరాబాద్‌లో ప్రజా రవాణాకు ఊతం.. చిలకలగూడలో కొత్త బస్ టెర్మినల్‌కు ప్రణాళిక