Dichpally Highway | జాతీయ రహదారిపై బైక్​, ఆటో ఢీ..: పలువురికి తీవ్ర గాయాలు

డిచ్​పల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను బైక్​ ఢీకొట్టిన ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Dichpally Highway | డిచ్​పల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను బైక్​ ఢీకొట్టిన ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి.

Dichpally Highway | గన్నారం నుంచి వస్తుండగా..

ఆలూర్​ మండలం రాంచంద్రపల్లి గ్రామానికి చెందిన మహిళలు ఆటోలో ఇందల్వాయి(Indalwai) మండలం గన్నారం వెళ్లి వస్తుండగా డిచ్​పల్లి హైవేపై ఆటోను బైక్​ వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆటో అదుపుతప్పి పడిపోయింది. అందులోని 11 మందికి గాయలయ్యాయి. వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించగా.. వారు క్షతగాత్రులను నిజామాబాద్​ జీజీహెచ్​కు తరలించారు. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారు. డిచ్​పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

govt

ఇది కూడా చదవండి : గోదావరి నదిలో దూకిన మహిళ.. కాపాడిన మత్స్యకారులు 

 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *