Hyderabad Hotel Raids | పలు హోటళ్లపై అధికారుల దాడులు.. కుళ్లిన చికెన్​ స్వాధీనం

నగరంలోని పలు హోటళ్లపై హెచ్​ – ఫాస్ట్​ అధికారులు దాడులు చేశారు. సికింద్రాబాద్​లోని ఓ చికెన్​ సెంటర్​లో కుళ్లిన చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Hotel Raids | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో కనీస నిబంధనలు పాటించడం లేదు. అపరిశుభ్ర వాతావరణంలో వంటలు వండుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. ఈ క్రమంలో అధికారులు కఠిన చర్యలు చేపట్టారు.

నగరంలో ఆహార కల్తీని అరికట్టానికి హెచ్​ ఫాస్ట్​ విభాగాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ బృందం అధికారులు ఆహార కల్తీపై ఉక్కుపాదం మోపుతున్నారు. నకిలీ ఆహార పదార్థాలు తయారు చేసే యూనిట్లపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అంతేగాకుండా హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేపడుతున్నారు. నిబంధనలు పాటించని హోటల్​ యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు.

chicken

Hyderabad Hotel Raids | జెప్టో స్టోర్​లో బొద్దింకలు

హెచ్​ ఫాస్ట్ అధికారులు మల్లేపల్లిలోని జెప్టో నౌ (ZeptoNow) స్టోర్​లో బుధవారం తనిఖీలు (Hyderabad Hotel Raids) చేశారు. స్టోర్‌లో బొద్దింకలు, ఎలుకల ఉన్నట్లు గుర్తించారు. తాడ్‌బన్‌ (Tadban) ప్రాంతంలోని ఒక పరోటా తయారీ కేంద్రంలో సోదాలు చేశారు. అపరిశుభ్రమైన పరిస్థితుల్లో, ఆహార పదార్థాలను తయారు చేయడమే కాకుండా, ప్యాకేజింగ్‌పై తప్పుడు తేదీలను ముద్రిస్తున్నట్లు గుర్తించారు. అలాగే సికింద్రాబాద్‌లోని ‘ఈగిల్ ఫిషరీస్’ (Eagle Fisheries) వద్ద అధికారులు కుళ్లిన చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రూ.3,000 జరిమానా విధించారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఈ కేసులను సంబంధిత ఆహార భద్రత, పోలీసు, పశుసంవర్ధక శాఖ అధికారులకు అప్పగించారు.

 

దీనిని కూడా చదవండి : Multi Visceral Transplant | వైద్య రంగంలో అద్భుతం.. చరిత్ర సృష్టించిన ఉస్మానియా వైద్య బృందం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *