Fish Bone Stuck | గొంతులో చేప ముల్లు ఇరుక్కుందా? చిటికెలో క్లియర్ చేసే అద్భుతమైన చిట్కాలు ఇవే!

నాన్‌వెజ్ ప్రియులు చికెన్, మటన్‌ను ఎంత ఇష్టంగా తింటారో.. చేపల వంటకాలను కూడా అంతే లొట్టలేసుకుంటూ ఆరగిస్తారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Fish Bone Stuck | నాన్‌వెజ్ ప్రియులు చికెన్, మటన్‌ను ఎంత ఇష్టంగా తింటారో.. చేపల వంటకాలను కూడా అంతే లొట్టలేసుకుంటూ ఆరగిస్తారు. అయితే, చేపలు ఎంత రుచిగా ఉంటాయో.. తినేటప్పుడు వాటి ముళ్లతో అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. చాలామంది గొంతులో ముల్లు ఇరుక్కుంటుందనే భయంతోనే చేపలు తినడానికి వెనకాడుతుంటారు. ఒకవేళ పొరపాటున గొంతులో ముల్లు చిక్కుకుంటే వచ్చే నొప్పి, అసౌకర్యం అంతా ఇంతా కాదు. వెంటనే డాక్టర్ దగ్గరకు పరిగెత్తే ముందు.. మన ఇంట్లోనే ఉండే కొన్ని సాధారణ వస్తువులతో ఈ సమస్య నుంచి చాలా సులభంగా ఉపశమనం పొందవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Fish Bone Stuck | కోల్డ్ డ్రింక్ మ్యాజిక్..

చేపలు సరిగ్గా ఉడకకపోయినా లేదా తినేటప్పుడు గమనించకపోయినా ముల్లు గొంతులో ఇరుక్కుపోయే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు అస్సలు కంగారు పడకుండా ఒక గ్లాసు కోల్డ్ డ్రింక్ (కోకాకోలా వంటివి) తాగండి. కోల్డ్ డ్రింక్స్‌లో ఉండే కార్బన్ డై ఆక్సైడ్  ( Carbon dioxide ) గ్యాస్ గొంతులో చిక్కుకున్న మెత్తటి ముల్లును మరింత సాఫ్ట్‌గా మారుస్తుంది. దీనివల్ల ఆ ముల్లు గొంతులో నుంచి ఈజీగా కిందకు జారిపోతుంది.

Fish Bone Stuck | నిమ్మరసంతో చెక్..

గొంతులో ఇరుక్కున్న ముల్లును వదిలించడంలో నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తుంది. ఒక నిమ్మకాయను పూర్తిగా పిండి, ఆ రసంలో కొద్దిగా ఉప్పు కలుపుకుని (నీళ్లు కలపకుండా) నేరుగా తాగేయాలి. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ (ఆమ్ల గుణం) ముల్లు పదునును తగ్గించి, దానిని మెత్తగా మార్చి కరిగిస్తుంది. దీంతో అది ఆహారంతో పాటు పొట్టలోకి వెళ్లి జీర్ణమైపోతుంది.

Fish Bone Stuck | ఆలివ్ ఆయిల్ లేదా వెనిగర్..

గొంతులో ముల్లు పడ్డప్పుడు ఒక చెంచా ఆలివ్ ఆయిల్ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆయిల్ గొంతు భాగమంతటినీ జిడ్డుగా (లూబ్రికేట్) మారుస్తుంది. దీనివల్ల అక్కడ ఇరుక్కున్న ముల్లు సులభంగా జారి కడుపులోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆలివ్ ఆయిల్ అందుబాటులో లేకపోతే.. ఒక గ్లాసు నీళ్లలో రెండు చెంచాల వెనిగర్ కలుపుకుని తాగినా గొంతులోని ముల్లు తొలగిపోతుంది.

ఈ చిట్కాలు చిన్నపాటి, మెత్తటి ముళ్లకు బాగా పనిచేస్తాయి. ఒకవేళ పెద్ద ముల్లు గుచ్చుకుని తీవ్రమైన నొప్పి లేదా రక్తం వస్తున్నట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

ఇది కూడా చదవండి: Dichpally Highway | జాతీయ రహదారిపై బైక్​, ఆటో ఢీ..: పలువురికి తీవ్ర గాయాలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *