అక్షరటుడే వెబ్‌డెస్క్: Rachita Ram Birthday | కన్నడ చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రచితా రామ్ పుట్టినరోజు వేడుకల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అక్టోబర్ 3న పుట్టినరోజు జరుపుకుంటున్న ఆమెను కలిసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఓ అభిమాని చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Rachita Ram Birthday | అభిమానులతో కలిసి సందడి..
ప్రతి ఏడాది పుట్టినరోజున అభిమానులను కలవడం అలవాటు ఉన్న రచితా రామ్.. ఈసారి కూడా వారితో సరదాగా గడుపుతూ ఉత్సాహంగా సెల్ఫీలు దిగారు. ఈ క్రమంలో ఆమెను చూసేందుకు, ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు.
Rachita Ram Birthday | బుగ్గలు గిల్లి షాక్ ఇచ్చిన ఫ్యాన్..
ఇదే సమయంలో రచితా రామ్ దగ్గరకు వచ్చిన ఒక అభిమాని ముందుగా ఆమెతో సెల్ఫీ తీసుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు షేక్‌హ్యాండ్ ఇచ్చి, అంతటితో ఆగకుండా ఒక్కసారిగా ఆమె రెండు బుగ్గలను పట్టుకుని గిల్లాడు. ఈ అనూహ్య పరిణామానికి హీరోయిన్ ఒక్కసారిగా షాకైనప్పటికీ, ఆ తర్వాత తేరుకుని క్యూట్‌గా నవ్వింది.
Rachita Ram Birthday | వైరల్ అవుతున్న వీడియో..
ఈ మొత్తం ఘటన అక్కడ ఉన్న కెమెరాలో రికాడవ్వడంతో ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు దీన్ని సరదా ఫ్యాన్ మూమెంట్‌గా భావిస్తుంటే.. మరికొందరు మాత్రం సెలబ్రిటీల వ్యక్తిగత హద్దులను గౌరవించాలని, అనుమతి లేకుండా ఇలా శారీరకంగా తాకడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. కన్నడ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన రచితా రామ్.. తెలుగులో ‘సూపర్ మచ్చి’ చిత్రంలో నటించారు. అలాగే తమిళంలో రజనీకాంత్ సరసన ‘కూలీ’ సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించి మంచి క్రేజ్ దక్కించుకున్నారు.
హరోయిన్ బుగ్గలు గిల్లిన ఫ్యాన్.. వీడియో వైరల్!
హీరోయిన్ రచితా రామ్ బర్త్‌డే వేడుకల్లో ఓ అభిమాని ఫొటో తీసుకున్న తర్వాత ఆమె బుగ్గలను అనూహ్యంగా గిల్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
During actress Rachita… pic.twitter.com/pNTZ8J5L9G
— Akshara Today | Telugu News (@AksharaToday) October 3, 2026
ఇది కూడా చదవండి: Sri City Pharma Blast | ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్.. ఐదుగురి మృతి