అక్షరటుడే, వెబ్డెస్క్: Balakrishna Injury | సినీ నటుడు బాలకృష్ణ షూటింగ్లో గాయపడ్డారు. కాకినాడలో ఫైట్ చిత్రీకరిస్తుండగా ఆయన మోకాలికి స్వల్ప గాయం అయింది.
బాలయ్య ప్రస్తుతం గోపిచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా భారీ యాక్షన్తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పోర్టులో జరుగుతోంది. ఈ క్రమంలో ఓ ఫైట్ షూట్ చేస్తుండగా.. మంగళవారం బాలకృష్ణ ప్రమాదవశాత్తు కింద జారి పడిపోయారు. దీంతో ఆయన మోకాలికి స్వల్ప గాయం అయింది.
Balakrishna Injury | ఆస్పత్రికి తరలింపు
బాలకృష్ణ గాయపడటంతో షూటింగ్ ఆపేశారు. అనంతరం ఆయనను చిత్ర యూనిట్ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆయనకు వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం పలు పరీక్షులు నిర్వహించారు. స్వల్పం గాయం కావడంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకొమ్మని చెప్పినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి..: National Film Awards | జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన.. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రోళ్లు