అక్షరటుడే, వెబ్‌డెస్క్ : National Film Awards | కేంద్ర ప్రభుత్వం జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించింది. 2024 సంవత్సరానికి గాను 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది.
జాతీయ ఉత్తమ చిత్రంగా ఆర్టికల్ 370 నిలిచింది. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం కల్కి, ఉత్తమ నటులు మమ్మూటి, కార్తీక్ఆర్యన్, ఉత్తమ నటిగా యమి గౌతమ్, ఉత్తమ దర్శకుడు అమరన్ (రాజ్‌కుమార్) ఎంపికయ్యారు. తెలుగులో ఉత్తమ చిత్రంగా ఎంపికైన కమిటీ కుర్రోళ్లు సినిమాను యదు వంశీ దర్శకత్వంలో, నిహారిక కొణిదెల (Niharika) సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించారు. 1990ల నాటి పల్లెటూరి జ్ఞాపకాలను అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాకు అవార్డు వరించింది. ఉత్తమ తమిళ సినిమా- ధనుష్ రాయన్, హిందీ చిత్రం– శ్రీకాంత్, ఉత్తమ కన్నడ చిత్రంగా మిథ్య ఎంపికయ్యాయి. ఉత్తమ యాక్షన్ మూవీగా మహారాజ (తమిళ్),, బెస్ట్ కొరియోగ్రఫ్రీ స్త్రీ2 (ఆజ్ కిరాత్)విజయ్ గంగూలీ, బెస్ట్ లిరిక్స్ – మైదాన్ (జానేదో) మనోజ్ ముంతాషిర్, బెస్ట్ మ్యూజిక్ – అమరన్ (తమిళ్) జీవీ ప్రకాశ్ కుమార్ అవార్డులు దక్కించుకున్నారు.
National Film Awards | నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో..
నాన్-ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో రెండు చిత్రాలకు ‘స్పెషల్ జ్యూరీ మెన్షన్’ అవార్డులు వరించాయి. హిందీ చిత్రం ‘చోళ డోరా ఔర్ సుయి’, మలయాళ చిత్రం ‘భద్ర-కాళి నాటకం’కు జ్యూరీ అవార్డులు వచ్చాయి. అలాగే బెస్ట్ స్కీన్ ప్లే అవార్డు పుష్ప-2కు, బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ కల్కి సినిమాకు లభించాయి.
దీనిని కూడా చదవండి : Yuva Sangrama Sadasu | కాంగ్రెస్‌కు డెత్ డిక్లరేషన్ రాయాలి : కేటీఆర్