Telangana University | 4 నుంచి తెయూలో ఐఎంబీఏ పరీక్షలు

తెలంగాణ యూనివర్సిటీలో ఐఎంబీఏ ఆరో సెమిస్టర్ థియరీ రెగ్యులర్ పరీక్షలు ఈనెల 4 నుండి 13 వరకు జరగనున్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, తెయూ క్యాంపస్: Telangana University | తెలంగాణ యూనివర్సిటీలో ఐఎంబీఏ(IMBA Exams) ఆరో సెమిస్టర్ థియరీ రెగ్యులర్ పరీక్షలు ఈనెల 4 నుండి 13 వరకు జరగనున్నాయి. ఈ మేరకు కంట్రోలర్ సంపత్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పరీక్షల పూర్తి వివరాలు తెలంగాణ యూనివర్సిటీ వెబ్​సైట్​లో పొందుపర్చామని తెలిపారు.

Telangana University | కొనసాగుతున్న బీఈడీ, బీపీఈడీ పరీక్షలు

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో బీఈడీ, బీపీఈడీ (BPED Exams) నాలుగో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం జరిగిన పరీక్షలకు 1,354 మందికి 1,330 మంది హాజరైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్సిటీ నియమనిబంధనలకు అనుగుణంగా విద్యార్థులు నడుచుకోవాలన్నారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *