అక్షరటుడే, తెయూ క్యాంపస్: TU UGC | తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) యూజీసీ అఫైర్స్(UGC Affairs) డైరెక్టర్‌గా అర్థశాస్త్ర విభాగం సహ ఆచార్యుడు పాత నాగరాజు నియమితులయ్యారు. ఈ మేరకు వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి ఉత్తర్వులు అందజేశారు.
TU UGC | గతంలో అర్థశాస్త్ర విభాగాధిపతిగా..
నాగరాజు గతంలో అర్థశాస్త్ర విభాగాధిపతిగా, పాఠ్య ప్రణాళిక సంఘ అధ్యక్షుడిగా, ప్రిన్సిపల్‌గా, ప్లేస్మెంట్ అండ్(Telangana Education) ట్రైనింగ్ సెల్ డైరెక్టర్‌గా, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్‌గా బాధ్యతలు నిర్వహించారు. యూజీసీ అఫైర్స్ డైరెక్టర్‌గా నియమితులైన డాక్టర్ నాగరాజుకు తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలిపారు. యూజీసీ అఫైర్స్ డైరెక్టర్ గా నియమించినందుకు వీసీ, రిజిస్ట్రార్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
