అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Paidi Rakesh Reddy | మహేష్ కుమార్ గౌడ్‌కు దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఆర్మూర్ నుంచి పోటీ చేయాలని ఆర్మూర్(Armoor) ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ మేరకు నగరంలో(Nizamabad) బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
Paidi Rakesh Reddy | ఆ జిల్లాలకే నిధులు
పీసీసీ చీఫ్(PCC Chief) ఎమ్మెల్సీకి.. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. ఇద్దరం ఉప ఎన్నికల్లో నిలబడితే ఎవరు గెలుస్తారో చూద్దామని రాకేష్ రెడ్డి అన్నారు. జిల్లాలో అభివృద్ధి శూన్యమని కేవలం రాజకీయ పదవుల కోసం మాత్రమే కాంగ్రెస్ నాయకులు పోటీ పడుతున్నారన్నారు. మహేష్ కుమార్ గౌడ్‌కు ఎమ్మెల్సీ పదవి కానీ పీసీసీ అధ్యక్ష పదవి గాని ఎవరికి లాభీయింగ్ చేస్తే వచ్చాయో ప్రజలకు తెలుసన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్కసారి కూడా గెలవని మహేష్ కుమార్ గౌడ్ తన గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి జిల్లాకు అన్యాయం చేస్తున్న మహేష్ కుమార్ గౌడ్‌కు అతి త్వరలో ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు మాత్రమే నిధులు ఇస్తుందని.. మిగతా జిల్లాలను పట్టించుకోవట్లేదన్నారు.
Paidi Rakesh Reddy | ఢిల్లీకి సూట్ కేసులు మోస్తూ..
నెలకు ఒకసారి ఢిల్లీకి (Delhi) సూట్ కేసులు మోస్తూ రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్లు పదవులు కాపాడుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు 210 లేఖలు రాసినా నిధులు మాత్రం మంజూరు చేయకుండా కాలయాపన చేస్తున్నారని, దమ్ముంటే జిల్లా అభివృద్ధికి నిధులు తెచ్చి రాజకీయ చతురత చూపాలని సవాల్ విసిరారు. భూమికి మూడు అడుగులు మాత్రమే ఉన్న ఈరవత్రి అనిల్ తనను నరుకుతా అని వ్యక్తిగత దూషణలకు దిగాడని.. మరోసారి విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దిగజారుడు రాజకీయాలకు వెళ్లవద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నూతల శ్రీనివాస్, నిజామాబాద్ జిల్లా ఫ్లోర్ లీడర్ ప్రమోద్, నాగోళ్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: మ్యాన్‌హోల్‌లో కొట్టుకుపోయిన వ్యక్తి