ACB Raids on DSP | డీఎస్పీ ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్‌లో డీఎస్పీ భీంరెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై ఆయన నివాసాల్లో తనిఖీలు చేపట్టారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: ACB Raids on DSP | హైదరాబాద్‌ (Hyderabad)లో డీఎస్పీ భీంరెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై ఆయన నివాసాల్లో దాడులు చేపట్టారు.

రాష్ట్రంలో అవినీతి అధికారులపై ఇటీవల ఏసీబీ దూకుడు పెంచింది. ముఖ్యంగా పదవిని అడ్డు పెట్టుకొని కోట్లు సంపాదించిన బడా తిమింగలాలను వేటాడుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదు చేసి అక్రమార్కుల భరతం పడుతోంది. వందల కోట్ల విలువైన​ అక్రమాస్తులను స్వాధీనం చేసుకుంటుంది. తాజాగా డీఎస్పీ భీమ్​రెడ్డి (DSP Bhim Reddy)తో పాటు ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో అధికారులు సోదాలు చేశారు. ఏకకాలంలో 20 చోట్ల తనిఖీలు చేపట్టారు. ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భారీగా అక్రమాస్తులను ఏసీబీ గుర్తించినట్లు సమాచారం.

ACB Raids on DSP | డీజీపీ ఆఫీస్​లో విధులు

ACB Raids on DSP

హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పని చేసిన భీం రెడ్డి భారీగా అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన డీజీపీ ఆఫీస్‌లోని కంప్యూటర్‌ సర్వీసెస్‌లో పని చేస్తున్నారు. మణికొండ మున్సిపాలిటీ మాజీ వైఎస్‌ ఛైర్మన్‌ నరేంద్‌రెడ్డి ఇంట్లోనూ ఏసీబీ సోదాలు చేపట్టింది. భీంరెడ్డి, నరేందర్‌రెడ్డి కలిసి వ్యాపారాలు చేస్తున్నట్లు సమాచారం. భీంరెడ్డి ఇంట్లో భారీగా విదేశీ మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి..: Jupally Gun Park | నేను కూడా గన్​ పార్క్​కే వస్తున్న : మంత్రి జూపల్లి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *