అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jupally Gun Park | తాను విసిరిన సవాల్‌కు కట్టుబడి ఉన్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తాను కూడా గన్ పార్క్కే వస్తున్నట్లు తెలిపారు. హరీష్ రావు, ఆయన బావమరిది కేటీఆర్ కూడా అక్కడికే రావాలన్నారు.
బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై చర్చకు తాను సిద్ధమని జూపల్లి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం తెలంగాణ భవన్‌కు వస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కేటీఆర్ (KTR), హరీశ్‌రావు తెలంగాణ భవన్‌కు వచ్చారు. అయితే అప్పటికే మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ గన్ పార్క్‌కు చేరుకున్నారు. దీంతో హరీశ్‌రావు, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ గన్‌పార్క్‌కు బయలు దేరగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మరోవైపు జూపల్లి కోసం కేటీఆర్ తెలంగాణ భవన్లో నిరీక్షిస్తున్నారు.
Jupally Gun Park | ఇద్దరు రండి
జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ 10 ఏళ్లలో రూ.7 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. కేటీఆర్, హరీశ్‌రావు గన్‌పార్క్‌కు రావాలని, తాను కూడా వస్తానని చెప్పారు. అక్కడే ప్రజల ముందు వాస్తవాలతో సమాధానం చెబుతాన్నారు. విడివిడిగా మాట్లాడటం ఎందుకు? ఇద్దరికీ ఒకేసారి అక్కడే జవాబిస్తాను అని పేర్కొన్నారు.
Jupally Gun Park | కిందపడిపోయిన హరీశ్‌రావు
తెలంగాణ భవన్ నుంచి గన్ పార్కుకు బయలు దేరిన హరీశ్‌రావును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట చోటుచేసుంది. ఈ క్రమంలో హరీశ్ రావు కిందపడిపోయారు. అనంతరం పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి, వాహనంలో తరలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. జూపల్లి నిన్న తెలంగాణ భవన్‌కు వస్తా అని, ఇప్పుడు మళ్లీ గన్ పార్క్ డ్రామా ఏందన్నారు. 11 గంటలకు తెలంగాణ భవన్‌కు వస్తాను అన్న ఎందుకు తోక ముడిచారని ప్రశ్నించారు. ‘‘తెలంగాణ భవన్‌కు రా.. కేటీఆర్ నీ కోసం ఎదురు చూస్తున్నారు” అన్నారు. మరోవైపు తెలంగాణ భవన్లో మంత్రి జూపల్లి కృష్ణారావు కోసం సిబ్బంది చైర్ ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి..: Harish Rao Arrest | హరీశ్‌రావును అడ్డుకున్న పోలీసులు.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత