అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao Arrest | కాంగ్రెస్, బీఆర్ఎస్ సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు, కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకులాల్లో అవినీతిపై చర్చకు సిద్ధమని రెండు పార్టీల నేతలు సవాళ్లు విసురుకున్న విషయం తెలిసిందే.
చర్చ కోసం మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, అజారుద్దీన్ గన్‌పార్క్ వద్దకు చేరుకున్నారు. మరోవైపు తాను తెలంగాణ భవన్‌కు వస్తానని జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. హరీశ్‌రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ నేతలతో చర్చించేందుకు గన్‌పార్క్‌కు బయలు దేరారు. జూపల్లి కృష్ణారావు కోసం తెలంగాణ భవన్లో కేటీఆర్ (KTR) ఎదురు చూస్తున్నారు. అయితే హరీశ్‌రావును పోలీసులు అడ్డుకున్నారు.
Harish Rao Arrest | అదుపులోకి తీసుకోవడంతో..
కారులో గన్‌పార్క్‌కు బయల్దేరిన హరీశ్‌రావును పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. హరీశ్‌రావు కారులో నుంచి దిగి నడుచుకుంటూ గన్ పార్క్ వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ భవన్ (Telangana Bhavan) ఎదుట రోడ్డుపై బైఠాయించిన హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. మంత్రులు చర్చకు పిలిచి.. పోలీసులతో అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Harish Rao Arrest | ఎందుకు ఆపుతున్నారు
హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు చర్చకు ధైర్యంగా పిలిచి.. ఇప్పుడు పోలీసులను పెట్టి ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. తమను ఆపాల్సిన అవసరం ఏమిటన్నారు. కాంగ్రెస్ నాయకులు అవినీతికి పాల్పడటంతోనే తమను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. డ్రగ్స్ సప్లయ్ చేస్తూ దొరికిన దొంగకు గురుకుల టెండర్లు కట్టాబెట్టారన్నారు. సవాల్ విసరడం ఎందుకని, పోలీసులను అడ్డు పెట్టుకొని పారిపోవడం ఎందుకని విమర్శించారు.
అమరవీరుల స్తూపం వద్దకు బయలుదేరుతున్న హరీశ్ రావు, ఇతర నాయకుల బృందం… pic.twitter.com/zVbbtTdAAX
— Sarita Avula (@SaritaAvula) July 2, 2026
ఇది కూడా చదవండి..: Fake Mutton Hyderabad | తక్కువ ధరకు మటన్ కొంటున్నారా.. ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు