అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hanumantha Rao Appointment | తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, వి హనుమంత్‌రావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
వీహెచ్ కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు. ఆయన గతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పని చేశారు. ఇటీవల రాష్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా.. అందులో ఒకదానిని వీహెచ్ ఆశించారు. అయితే ఆయనను కాదని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సన్నిహితుడు వేం నరేందర్‌రెడ్డికి పదవి అప్పగించారు. దీనిపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం ఆయనను కేబినెట్ హోదాతో బీసీ సంక్షేమ, అభివృద్ధి శాఖ ప్రభుత్వ సలహాదారుగా నియమించడం గమనార్హం. ఈ పదవితో ఆయన నెలకు రూ. లక్ష జీతం అందుకోనున్నారు. ఇతర అలవెన్స్‌లు ఉంటాయి. బీసీ సంక్షేమ శాఖ నుంచి వీటిని చెల్లించనున్నారు.
Hanumantha Rao Appointment | భద్రతా సలహాదారుగా శివధర్‌రెడ్డి
డీజీపీ శివధర్‌రెడ్డి (DGP Shivadhar Reddy) నేడు పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు శివధర్‌రెడ్డిని ప్రభుత్వ భద్రతా సలహాదారుగా నియమించింది. పోలీస్ వ్యవహారాలు, శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, నేర నియంత్రణ, మాదకద్రవ్యాల నియంత్రణ మరియు రహదారి భద్రతకు సంబంధించి సలహాలు అందించనున్నారు. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి 3 సంవత్సరాల పాటు ఆయన పదవిలో కొనసాగుతారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాతో సమానంగా ఆయనకు ర్యాంక్ కల్పించారు.
ఇది కూడా చదవండి..: Shivadhar Reddy Farewell | డీజీపీ శివధర్‌రెడ్డికి ఘనంగా వీడ్కోలు

