Bandi Bhageerath | సాయిభగీరథ్​ను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలి

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్: Bandi Bhageerath | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ (Minister Sanjay) కుమారుడు బండి సాయిభగీరథ్​ను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని పీవోడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు సత్తెమ్మ డిమాండ్​ చేశారు. నగరంలోని సంస్థ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

Bandi Bhageerath | కేసును తారుమారు చేసేందుకు..

అమ్మాయిలపై అకృత్యాలకు పాల్పడిన తన కుమారుడిని ప్రోత్సహిస్తున్న బండి సంజయ్​ తన కేంద్ర సహాయ మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని సత్తెమ్మ డిమాండ్​ చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని చూసుకొని మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి అయి ఉండి ఒక మైనర్ బాలికపై జరిగిన అకృత్యాలను తారుమారు చేసేందుకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం (State Government) బాధితురాలికి అండగా ఉండి, బాలిక కేసు విషయంలో నిష్పాక్షికంగా విచారణ చేయాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం (POW) ఆర్మూర్ ఏరియా అధ్యక్షురాలు జి.పద్మ, ఏరియా కార్యదర్శి లక్ష్మి, ఏరియా నాయకురాలు యం.సునీత, ఎం.స్వారూప, ఇస్తారమ్మ, రేష్మ, సాయమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Telangana Protest Arrests | మలిదశ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *