Gram Panchayat Buildings | జీపీ నూతన భవనాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు: ఎమ్మెల్యే పోచారం

Shivam nagarani

అక్షరటుడే, బాన్సువాడ: Gram Panchayat Buildings | గ్రామ పంచాయతీ భవన నిర్మాణం ద్వారా గ్రామస్థులకు మెరుగైన పరిపాలన సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అన్నారు. వర్ని మండలం వకీల్ ఫారం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి పోచారం భూమి పూజ చేశారు.

Gram Panchayat Buildings | ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా వినియోగించాలి..

ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి పంచాయతీ కార్యాలయాలు (Panchayat Offices) కీలక పాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే పోచారం పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామన్నారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో వర్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ సురేష్ బాబా, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Gram Panchayat Buildings

ఇది కూడా చదవండి..: Drinking Water | వేసవిలో తాగునీటి కొరత లేకుండా చర్యలు..: సబ్ ​కలెక్టర్​ వికాస్​ మహతో

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *