Kia Syros 2026 | కియా సైరోస్.. నయా లుక్!

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Kia Syros 2026 | భారతీయ మార్కెట్‌లో వాటా పెంచుకునేందుకు దక్షిణ కొరియా (South Korea)కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా.. మరో కీలక అప్‌డేట్‌తో ముందుకు వచ్చింది. అప్‌డేటెడ్ సైరోస్ 2026 మోడల్ ఇయర్ (ఎంవై26) కారును పరిచయం చేసింది. విస్తరించిన వేరియంట్ లైనప్, నవీకరించిన డిజైన్, కొత్త డీజిల్ ఆటోమేటిక్ ట్రిమ్‌లతో సహా ఆటోమేటిక్ ఆప్షన్‌ల మెరుగైన లభ్యతతో రూ. 8.39 లక్షల ప్రారంభ ధర(ఎక్స్ షోరూమ్)తో అందుబాటులో ఉంది.

Kia Syros 2026 | నాలుగు ట్రిమ్ లలో..

సైరోస్ ఎంవై26 హెచ్ టీఈ, హెచ్‌టీఈ(ఓ), హెచ్‌టీకే ప్లస్(ఓ), హెచ్‌టీఎక్స్ (ఓ) ట్రిమ్ లలో లభిస్తుంది. ప్రతి ట్రిమ్ తనదైన ఫీచర్లతో వేర్వేరు అవసరాలను తీర్చేలా రూపొందించబడింది. ముందు, వెనక భాగాలు మరింత స్పోర్టీగా, దృఢంగా ఉండేలా రూపొందించారు. మార్పులలో బాడీ కలర్ ఏరో ఇన్సర్ట్‌లతో కూడిన కొత్త ఫ్రంట్ బంపర్, ఎలఈడీ ఫాగ్ ల్యాంప్‌లతో కూడిన గ్లాసీ బ్లాక్ స్కిడ్ ప్లేట్లు, ఎలఈడీ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్‌తో పునఃరూపకల్పన చేసిన వెనక బంపర్ ఉన్నాయి. బాడీ కలర్ సైడ్ గార్నిష్‌తో పాటు, గ్లాసీ బ్లాక్ రూఫ్ రైల్స్ ఓఆర్‌వీఎంలతో సైడ్ ప్రొఫైల్ మెరుగయ్యింది.
ఉన్నత శ్రేణి ట్రిమ్‌లు ఇప్పుడు నియాన్ కలర్ బ్రేక్ కాలిపర్‌లతో కూడిన కొత్త 17 అంగుళాల క్రిస్టల్ కట్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉన్నాయి.

Kia Syros 2026 | ఫీచర్స్..

సైరోస్ ఎంవై26 (Cyros MY26) కనెక్టెడ్ కార్ నావిగేషన్ కాక్‌పిట్‌తో కూడిన 30 అంగుళాల ట్రినిటీ పనోరమిక్ డిస్‌ప్లే ఉంది. డ్యుయల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ముందు, వెనక సీట్లు, 60:40 స్ప్లిట్ ఫంక్షనాలిటీతో కూడిన ఫ్లెక్సిబుల్ రెండో వరుస సీట్లున్నాయి. రెండో వరుస సీట్లకు 60:40 స్ప్లిట్ కాన్ఫిగరేషన్‌తో పాటు స్లైడింగ్, రిక్లైనింగ్ ఫంక్షన్ ఇవ్వడం వల్ల ఫ్యామిలీ యూజ్‌కు ఇది మరింత అనుకూలంగా మారింది. ఇందులో 80కి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లు, ఓటీఏ అప్‌డేట్లు, కియా కనెక్ట్ డయాగ్నోస్టిక్స్ ఉన్నాయి.

భద్రత ఫీచర్లు..

20 ఫీచర్ల భద్రత ప్యాకేజీతో వస్తోంది. ఈ ఎస్‌యూవీ ఫైవ్ స్టార్ భారత్ ఎన్‌క్యాప్ రేటింగ్‌ను కలిగి ఉంది.

Kia Syros 2026 | డీజిల్ కస్టమర్ల కోసం..

మాగ్మా రెడ్, ఐవరీ సిల్వర్ మ్యాట్ మరియు ఐవరీ సిల్వర్ గ్లాస్ వంటి కొత్త కలర్స్‌లో లభిస్తోంది.
కియా ఇండియా డీజిల్ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలను విస్తరించి, ఇప్పుడు హెచ్‌టీకే ప్లస్ ట్రిమ్ నుంచే ఆటోమేటిక్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది డీజిల్ వాహనం కోరుకునే వారికి మరింత సౌకర్యాన్ని ఇస్తుంది. డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 12.73 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

ఇది కూడా చదవండి..: OPPO F33 5G | మిడ్ రేంజ్‌లో ఒప్పో నుంచి సూపర్ ఫోన్

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *