OPPO F33 5G | మిడ్ రేంజ్‌లో ఒప్పో నుంచి సూపర్ ఫోన్

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: OPPO F33 5G | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ (OPPO Indian Smartphone) మార్కెట్‌లోకి మరో కొత్త ఫోన్ ను తీసుకువచ్చింది. మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో ఒప్పో ఎఫ్ 33 5జీ పేరుతో విడుదల చేసింది. ఇందులో భారీ బ్యాటరీ, అధునాతన ప్రాసెసర్ అమర్చారు. కంపెనీ వెబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్ (Flipkart), అమెజాన్‌ (Amazon)లలో ఏప్రిల్ 26 నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.

OPPO F33 5G | డిస్‌ప్లే..

6.57 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఫ్లాట్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇది 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. ఐపీ66, ఐపీ68, ఐపీ69కే రేటింగ్ కూడా ఉంది. ఇది 12 గంటలపాటు నీళ్లలో నానినా ఫోన్ డ్యామేజ్ కాకుండా చూస్తుందని కంపెనీ చెబుతోంది.

OPPO F33 5G | కెమెరా సెటప్..

కెమెరా సెటప్‌లో వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కూడా ఉంది. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

OPPO F33 5G | సాఫ్ట్‌వేర్..

మీడియాటెక్ డైమెన్సిటీ 6360 మ్యాక్స్ ఆక్టా కోర్ చిప్‌సెట్ ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ ఓఎస్ 3పై పనిచేస్తుంది.

OPPO F33 5G | బ్యాటరీ సామర్థ్యం ..

7000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంది. ఇది 80 డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఐదు నిమిషాల పాటు బ్యాటరీని చార్జ్ చేస్తే గంటపాటు వాట్సాప్ వీడియో కాలింగ్‌కు, 1.6 గంటలపాటు ఇన్‌స్టాగ్రామ్ బ్రౌజింగ్ చేయొచ్చని కంపెనీ పేర్కొంటోంది.

వేరియంట్స్ : ఫారెస్ట్ గ్రీన్, పర్ల్ వైట్ కలర్‌లలో మూడు వేరియంట్లలో లభిస్తుంది.
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 31,999.
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999.
8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,999.

కార్డ్ ఆఫర్స్ : ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో చేసే కొనుగోళ్లపై రూ. 3,200 వరకు తక్షణ డిస్కౌంట్ లభించనుంది.

ఇది కూడా చదవండి..: Gold price forecast | బంగారం ధర మళ్లీ రూ.1.85 లక్షలకు చేరుతుందా!

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *