అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market Gains | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) బుధవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయినా భారీ లాభాల దిశగా సాగుతోంది. బెంచ్ మార్క్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 339 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 132 పాయింట్లు పెరిగింది.
గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌తో 553 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 118 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 59 పాయింట్లు లాభపడింది. అక్కడి నుంచి 163 పాయింట్లు కోల్పోయింది. 11 గంటల తర్వాత సూచీలు వీ షేప్ లో రికవరీ అయ్యాయి. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 29 పాయింట్ల లాభంతో 74,530 వద్ద, నిఫ్టీ (Nifty) 19 పాయింట్ల లాభంతో 23,398 వద్ద ఉన్నాయి.
Stock Market Gains | మిక్స్‌డ్ గా ఇండెక్స్‌లు..
నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 2.05 శాతం, మెటల్ 1.70 శాతం, యుటిలిటీ 1.07 శాతం, టెలికాం 1 శాతం లాభాలతో ఉండగా.. ఐటీ 2.49 శాతం, రియాలిటీ 1.06 శాతం, ఆటో 0.61 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.54 శాతం నష్టాలతో సాగుతున్నాయి.
Top gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 22 స్టాక్స్ లాభాలతో, 8 స్టాక్ట్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఎయిర్‌టెల్ 3.58 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.17 శాతం, ఎటర్నల్ 2.10 శాతం, సన్‌ఫార్మా 1.65 శాతం, ఎల్ టీ 1.64 శాతం లాభాలతో ఉన్నాయి.
Top losers : టెక్ మహీంద్రా 3.04 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 2.51 శాతం, ఇన్ఫోసిస్ 2.50 శాతం, టీసీఎస్ 1.97 శాతం, మారుతి 0.89 శాతం నష్టంతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Uber CEO Delhi Metro| సామాన్యుడిలా ఢిల్లీ మెట్రోలో ఉబర్ సీఈఓ ప్రయాణం


