Premarket analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. ఫ్లాట్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ..

ప్రధాన గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ లాభాలతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్‌లో ప్రారంభం కానున్నాయి. 

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్ డెస్క్: Premarket analysis | ప్రపంచ మార్కెట్ల (Global markets) నుంచి మిశ్రమ సంకేతాలు అందుతున్నాయి. గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్ లాభాలతో, యూరోప్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగిశాయి. సోమవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ (Gift nifty) మునుపటి ముగింపుతో పోలిస్తే ప్రీమియంతో ఉండడంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Premarket analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్ లాభాలతో ముగిసింది. నాస్‌డాక్ 1.91 శాతం, ఎస్ అండ్ పీ 1.08 శాతం లాభపడగా.. శుక్రవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.17 శాతం నష్టంతో ఉంది.

Premarket analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.12 శాతం పెరగ్గా.. ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.42 శాతం, యూకేకు చెందిన ఎఫ్ టీఎస్ ఈ 0.41 శాతం నష్టపోయాయి.

Premarket analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 2.73 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ(Nikkei) 2.14 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 1 శాతం, లాభాలతో ఉండగా.. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.55 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.43 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.13 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ, నిఫ్టీ 0.34 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Premarket analysis | గమనించాల్సిన అంశాలు..

ఎఫ్ఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 4,859 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.

డీఐఐలు 23 సెషన్స్ తర్వాత నికర అమ్మకందారులుగా మారారు. గత సెషన్‌లో నికరంగా రూ. 1,159 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.

డాలర్‌తో రూపాయి మారకం విలువ 1 పైసలు బలపడి 94.33 వద్ద ఉంది.

యూఎస్ డాలర్ ఇండెక్స్ 100.84 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.48 వద్ద ఉన్నాయి.

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 79.13 డాలర్ల వద్ద ఉంది.

అమెరికాతో శాంతి చర్చలలో పురోగతి సాధించామని ఇరాన్ ప్రతినిధులు తెలిపారు. దీంతో ఈ ప్రక్రియ విఫలమవుతోందన్న భయాలు తగ్గుముఖం పట్టాయి. చర్చల మొదటి విడత ముగిసిందని, 60 రోజుల్లో తుది ఒప్పందానికి రావడానికి ఒక రోడ్‌మ్యాప్‌పై పురోగతి సాధించామని ఖతార్, పాకిస్తాన్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.

ఇది కూడా చదవండి..: Advit Jewels IPO | ఐపీవోకు అద్విత్ జ్యువెల్స్.. 23న సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *