July 20 market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. నష్టాలతో ప్రారంభం కానున్న సెన్సెక్స్

గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ నష్టాలతో ఉండడంతో మన మార్కెట్లు నెగెటివ్ గా ప్రారంభమవనున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: July 20 market Analysis | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. దీంతో క్రూడ్ ఆయిల్ (Crude oil) ధర మళ్లీ బ్యారెల్‌కు 90 డాలర్లు దాటింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో గ్లోబల్ మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ నుంచి అందుతున్న బలహీనమైన సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాలతో ప్రారంభం కానున్నాయి.

July 20 market Analysis | యూఎస్ మార్కెట్లు..

సెమీకండక్టర్ స్టాక్స్‌లో ప్రాఫిట్ బుకింగ్‌తో వాల్‌స్ట్రీట్ నష్టాలతో ముగిసింది. గత సెషన్‌లో నాస్‌డాక్ 1.40 శాతం, ఎస్ అండ్ పీ 1.01 శాతం నష్టపోగా.. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.04 శాతం నష్టంతో ఉంది.

July 20 market Analysis | యూరోప్ మార్కెట్లు..

యూకేకు చెందిన ఎఫ్ టీఎస్ ఈ 0.27 శాతం పెరగ్గా.. జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.34 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.47 శాతం నష్టపోయాయి.

July 20 market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 2.28 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.97 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.17 శాతం లాభాలతో ఉండగా.. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 4.16 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.34 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.

జపాన్ మార్కెట్లు సెలవుదినం కారణంగా మూసి ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ, నిఫ్టీ 0.22 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ ఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 376 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 1,017 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.97 నుంచి 1.42 కు పెరిగింది.
  • విక్స్ 2.08 శాతం పెరిగి 13.15 వద్ద ఉంది.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 90.22 డాలర్ల వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 8 పైసలు బలపడి 96.28 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 100.75 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.55 వద్ద ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: July 17 Gold Prices | బంగారం కొనుగోలుదారులకు ఊరట.. హైదరాబాద్‌లో స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేట్లు

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *