Armoor Political Tension | ఆర్మూర్​లో హైటెన్షన్.. వినయ్​ రెడ్డి హౌస్​ అరెస్ట్

ఆర్మూర్​లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ నేతల పోటాపోటీ సవాళ్లతో నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్: Armoor Political Tension | ఆర్మూర్​లో(Armoor) హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ నేతల పోటాపోటీ సవాళ్లతో నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Armoor Political Tension | ఎవరికి వారు మంతనాలు..

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘చలో అంకాపూర్’నకు పిలుపునివ్వగా ఆ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ కుమార్ రెడ్డిని (Vinay Kumar Reddy) పోలీసులు ఉదయాన్నే హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు ఆర్మూర్ ఎమ్మెల్యే పార్టీ రాకేష్ రెడ్డి(Mla Rakesh Reddy) అంకాపూర్​లోని తన నివాసంలో ఉన్నారు. బీజేపీ నాయకులతో ఉదయాన్నే సమావేశంలో పాల్గొన్నారు. నాయకులు కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్​లో తనస్థాయి నాయకుడితో కలిసి యుద్ధానికి సిద్ధం అంటూ భీష్మించుకొని ఇంటి వద్ద కూర్చున్నారు.

Armoor Political Tension | ఎక్కడికక్కడే అరెస్ట్​లు..

మరోవైపు ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్, డొంకేశ్వర్, మాక్లూర్, ఆర్మూర్, ఆలూర్ మండలాల్లోని బీజేపీ, కాంగ్రెస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్​ చేశారు. మరోవైపు ఆదివారం సాయంత్రమే పలువురు కీలక నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే అప్రమత్తమైన పోలీస్​శాఖ ఆర్మూర్​లో బీఎన్​ఎస్​ 163 సెక్షన్​ విధించింది. ఐదుగురి కంటే ఎక్కువ మంది కలిసి తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్​హెచ్​వో సత్యనారాయణ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి : చలో అంకాపూర్​కు కాంగ్రెస్​ పిలుపు.. తన నివాసంలో సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యే రాకేశ్​ రెడ్డి 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *