Mallareddy daughter-in-law | బీజేపీ కార్యాలయానికి మల్లారెడ్డి కోడలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mallareddy daughter-in-law | మాజీ మంత్రి, మేడ్చల్​ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Malla Reddy) కోడలు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి (BJP Office) వెళ్లారు. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారిని ఆమె కలిశారు. ఈ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

Mallareddy daughter-in-law | బీజేపీలో చేరుతారా

మల్లారెడ్డి కోడలు డాక్టర్​ ప్రీతిరెడ్డి (Preethi Reddy) సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉంటారు. మల్లారెడ్డి కాలేజీ, ఫ్యామిలీ ఫంక్షన్​లో ఆమె డ్యాన్స్​తో అదరగొడతారు. మల్లారెడ్డి ప్రస్తుతం బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన కోడలు బీజేపీ నేతలను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోదీ (PM Modi)ని ఆమె కలిశారు. రెండు రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావుతో సైతం భేటీ అయ్యారు. దీంతో ఆమె బీజేపీలో చేరుతారానే ప్రచారం జరుగుతోంది.

దీనిని కూడా చదవండి : 8th Pay Commission Salary | కనీస వేతనం రూ. 72 వేలు.. 8వ వేతన సంఘానికి బీపీఎంఎస్ ప్రతిపాదన!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *