Yellareddy Development | అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్న బీఆర్ఎస్ నాయకులు

shashi kiran Mottala

అక్షరటుడే, లింగంపేట: Yellareddy Development | ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని చూసి బీఆర్​ఎస్​ పార్టీ నాయకులు ఓర్వలేకపోతున్నారని.. ఎమ్మెల్యేపై అసత్య ప్రచారాలు మానుకోవాలని కాంగ్రెస్ (Congress Party) లింగంపేట మండల అధ్యక్షుడు గోకుల్ సాయిరాం అన్నారు. కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

గత పదేళ్లు పరిపాలించిన బీఆర్​ఎస్ ఎలాంటి అభివృద్ధి చేయకపోవడంతో ప్రజలు ఓడించి మూలకు కూర్చోబెట్టారన్నారు. బీఆర్​ఎస్​ అధికారంలో ఉన్నప్పుడు పోల్కంపేట్ చౌదరి చెరువుకు గండిపడి మూడేళ్లు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే మదన్​మోహన్​ ఆధ్వర్యంలో వెంటనే మరమ్మతులు చేయించారని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సొంత గ్రామమైన నల్లమడుగులో కొన్నేళ్లుగా మురికికాల్వల సమస్య ఉండేదని ఎమ్మెల్యే మదన్​ మోహన్​ (MLA Madan Mohan) వచ్చాకే డ్రెయినేజీల నిర్మాణం పూర్తయిందన్నారు. నియోజకవర్గంలో రైతులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం తగదన్నారు.

Yellareddy Development | లింగంపల్లి వంతెనకు నిధులు మంజూరు

లింగంపల్లి వంతెన, మల్లారం చెరువు, పోల్కంపేట్ చౌదరి చెరువుల మరమ్మతులకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిధులు మంజూరు చేశారని గోకుల్​ సాయిరాం చెప్పారు. వెంటనే పనులు ప్రారంభమవుతాయని రైతులు అధైర్య పడవద్దని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ రాజు, పీసీసీ మైనార్టీ కార్యదర్శి రఫీయొద్దీన్, నారా గౌడ్, సర్పంచ్​ల ఫోరం అధ్యక్షుడు సక్రు, ప్రసాద్ గౌడ్, కుండా బాలకిషన్, సేవ్యా, ఎల్లమయ్య, రాజు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Rajiv Gandhi Tribute | యువతకు ప్రత్యక్ష రాజకీయాల్లో అవకాశం కల్పించిన ఘనత రాజీవ్​దే : డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *