తెలంగాణRevanth Reddy Convoy | సాధారణ ట్రాఫిక్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌

Revanth Reddy Convoy | సాధారణ ట్రాఫిక్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌

సీఎం రేవంత్​రెడ్డి గురువారం సాధారణ ట్రాఫిక్​లో ప్రయాణించారు. తన కాన్వాయ్​ కోసం ట్రాఫిక్​ను ఆపలేదు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revanth Reddy Convoy | ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఆయన కాన్వాయ్​ కోసం పోలీసులు వాహనాలు నిలిపివేస్తారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతారు. ఈ క్రమంలో సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్​ కోసం వాహనాలు ఆపొద్దని ఆదేశించారు. ఈ మేరకు గురువారం సాధారణ ట్రాఫిక్​లో పర్యటించారు.

ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చారు. ఢిల్లీ వెళ్తున్న సమయంలో శంషాబాద్​ ఎయిర్​పోర్టు (Shamshabad Airport) మార్గంలో తన కాన్వాయ్​ కోసం వాహనాలను ఆపడాన్ని ఆయన గమనించారు. ఇక నుంచి ట్రాఫిక్​ను ఆపొద్దని డీజీపీని ఆదేశించారు. గురువారం సీఎం ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్​ వచ్చారు. శంషాబాద్​ విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్​లోని తన నివాసం వరకు సాధారణ ట్రాఫిక్‌లో ప్రయాణించారు. సీఎం ఆదేశాలతో ఇవాళ కాన్వాయ్‌ వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయకుండా ఒక మార్గంలో పోలీసులు అనుమతించారు.

Revanth Reddy Convoy | గతంలో సైతం..

రేవంత్​రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో సైతం ఇలాంటి ఆదేశాలే ఇచ్చారు. తన కాన్వాయ్​ కోసం వాహనాలు నిలిపేయొద్దని సూచించారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతారని పేర్కొన్నారు. అయితే కొద్ది రోజులు దీనిని అమలు చేసిన పోలీసులు తర్వాత.. మరిచిపోయారు. దీంతో సీఎం కాన్వాయ్​ కోసం వాహనాలను నిలివేస్తుండటంతో ప్రజలు ట్రాఫిక్​లో ఇబ్బందులు పడుతున్నారు. అసలే నగరంలో ట్రాఫిక్​ రద్దీ అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో సీఎం, ఇతర మంత్రుల కాన్వాయ్​ల కోసం వాహనాలు ఆపుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. తాజాగా సీఎం ట్రాఫిక్​ను ఆపొద్దని ఆదేశించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిని ఇలాగే కొనసాగించాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: ACB Raid | ఏసీబీ వలలో అటవీశాఖ అధికారులు.. రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటూ..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Kamareddy Co-option Election | కొనసాగిన కాంగ్రెస్​..బీఆర్​ఎస్​ బంధం.. ముగిసిన కామారెడ్డి కోఆప్షన్​ ఎన్నిక

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Co-option Election | కామారెడ్డి మున్సిపాలిటీలో (kamareddy...

Olympiad Education | బంగారు భవితకు పునాది.. విద్యార్థుల విజయానికి స్వర్ణ మార్గం.. ఒలంపియాడ్‌ విద్య 

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Olympiad Education | నేటి వేగవంతమైన ఆధునిక ప్రపంచంలో...

Tamil Nadu Crisis| గవర్నర్ తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం.. రేపు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు

అక్షరటుడే వెబం‌డెస్క్:Tamil Nadu Crisis|తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై కాంగ్రెస్...

Kalleda Village | కల్లెడలో విషాదం.. ఉరి వేసుకుని యువతి బలవన్మరణం

అక్షరటుడే, ఆర్మూర్​: Kalleda Village | ఆలూర్​ మండలం (Alur mandal)...