నిజామాబాద్Drunk Driving Cases | మూడు వారాలు.. 432 డ్రంకన్​ డ్రైవ్​ కేసులు..: సీపీ సాయిచైతన్య

Drunk Driving Cases | మూడు వారాలు.. 432 డ్రంకన్​ డ్రైవ్​ కేసులు..: సీపీ సాయిచైతన్య

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్​ పరిధిలో మూడు వారాల్లో 432 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు.

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Drunk Driving Cases | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (Nizamabad Police Commissionerate)​ పరిధిలో మూడు వారాల్లో 432 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) తెలిపారు. ఈ సందర్భంగా తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వారికి రూ.40 లక్షలకు పైగా కోర్టులు జరిమానాలు విధించాయని వెల్లడించారు.

Drunk Driving Cases | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో..

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్​, బోధన్ (bodhan), ఆర్మూర్ తదితర ప్రాంతాల్లో మూడు వారాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ (Drunk Driving) తనిఖీలు చేపట్టామన్నారు. ఈ తనిఖీల్లో 432 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ సందర్భంగా వారిని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్(Armoor) కోర్టులలో ప్రవేశపెట్టగా.. 25 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష పడిందని చెప్పారు. మిగతా వారి వద్ద నుంచి రూ.40,25,000 జరిమానాలు వసూలు చేసినట్లు తెలిపారు.

Drunk Driving Cases | మద్యం తాగి వాహనాలు నడపవద్దు..

మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని సీసీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వాహనదారులు తమ వాహనాలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు ఎల్లప్పుడూ వెంటనే ఉంచుకోవాలని తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్​లో పట్టుబడిన వారి లైసెన్సు ఆరు నెలల పాటు సస్పెండ్ చేయనున్నట్లు హెచ్చరించారు. మైనర్లు తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడితే మైనర్​తో పాటు వాహనం ఓనర్ పై కూడా కేసు నమోదు చేస్తామని జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Eatala Rajender comments | రాజకీయాల్లో తోసుకుంటూ పోవాల్సింటే : ఎంపీ ఈటల

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Minority School Admissions | ఎల్లారెడ్డి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Minority School Admissions | పట్టణంలోని తెలంగాణ మైనార్టీ...

Union Bank Apprentice | యూనియన్ బ్యాంక్ లో అప్రెంటిస్ పోస్టులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Union Bank Apprentice | బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగ...

IPL Betting Suicide | ఐపీఎల్ బెట్టింగ్​కు బలి.. ఆత్మహత్య చేసుకున్న వ్యాపారి

అక్షరటుడే, వెబ్​డెస్క్: IPL Betting Suicide | ఐపీఎల్​ బెట్టింగ్​ భూతానికి...

Telangana Employees Protest | 5న ఉద్యోగుల సామూహిక నిరాహార దీక్ష

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Telangana Employees Protest | తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్...