అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: NEET PG Exam | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (Nizamabad Police Commissionerate) పరిధిలోని జరగనున్న నీట్ పరీక్షకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు.
NEET PG Exam | అర్సపల్లి పరిధిలోని..
అర్సపల్లి పరిధిలోని కళాశాలలో మే 2వ తేదీన నీట్ పీజీ పరీక్ష జరుగనుందన్నారు. పరీక్షలు జరిగే రోజుల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 163 బీఎన్ఎస్(BNS) (పాత సెక్షన్ 144 సీఆర్పీసీ) అమలులో ఉంటుందని వెల్లడించారు. ఈ నిబంధన ప్రకారం.. పరీక్షా కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఇద్దరికి మించి గుంపులుగా చేరడం నిషేధమన్నారు. అలాగే పరీక్ష కేంద్రాల వద్ద ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీ దుకాణాలు మూసి ఉంచేలా ఆదేశాలిచ్చామన్నారు.
ఇది కూడా చదవండి: FBO Caught by ACB | పోడు భూమి కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్

