Yellareddy Police | అన్నదాత బలవన్మరణం..

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Police | అనారోగ్యంతో రైతు ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ ఘటన మండలంలోని (Yellareddy) వెంకటాపూర్​ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.

Yellareddy Police | ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో..

ఎల్లారెడ్డి మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి (Venkatapur village) చెందిన ఎముల చిన్న లింగయ్య (71) వ్యవసాయం చేస్తుండేవాడు. అయితే కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కామారెడ్డిలో (Kamareddy) వైద్య చికిత్స పొందినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సుమారు 7:30 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి గ్రామ శివారులోని పస్కపోచమ్మ ఆలయం సమీపంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఎముల రామవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Stock Market Fall | ప్రారంభ లాభాలు ఆవిరి.. నష్టాలతో ముగిసిన సూచీలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *