నిజామాబాద్Tank Repair Works | చెరువుల మరమ్మతులపై అలసత్వం వహించొద్దు: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

Tank Repair Works | చెరువుల మరమ్మతులపై అలసత్వం వహించొద్దు: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

నియోజకవర్గంలో చెరువులు, చెక్​డ్యాంల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని.. అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు.

అక్షరటుడే, డిచ్​పల్లి: Tank Repair Works | నియోజకవర్గంలో చెరువులు, చెక్​డ్యాంల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని.. అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (MLA Bhupathi Reddy) పేర్కొన్నారు. ఆ మేరకు ఎమ్మెల్యే తన నివాసంలో ఇరిగేషన్​ అధికారులతో సమావేశంమయ్యారు.

Tank Repair Works | వర్షాకాలం లోపు..

ముత్యాల చెరువు గత వర్షాకాలంలో దెబ్బతినగా వెంటే మరమ్మతులు చేయించాలని మండలంలోని వాడి, హొన్నాజీపేట గ్రామ రైతులు ఎమ్మెల్యేకు విన్నవించారు. ఈ మేరకు మరమ్మతుల పనులకు సంబంధించిన ప్రణాళికను మ్యాప్ పాయింట్ ద్వారా ఎమ్మెల్యేకు అధికారులు వివరించారు. అదేవిధంగా చెరువు రక్షణార్థం ప్రొటెక్షన్ వాల్ నిర్మాణంతో పాటు నియోజకవర్గంలోని చెక్​డ్యాంల అంశంపై చర్చించారు.

సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే నిధుల విడుదల తదితర అంశాలపై రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)కి లేఖ రాశారు. కాగా నియోజకవర్గంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వర్షాకాలం కంటే మునుపే పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ నజీర్ హుస్సేన్, ఈఈ నరేంద్ర కుమార్, డీఈ ప్రేమ్ కుమార్, ఏఈలు సాయినాథ్, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Paddy Procurement Centers | ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన అధికారులు..‘అక్షరటుడే’ కథనానికి స్పందన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Telangana IAS Officers| జాతీయ స్థాయిలో తెలంగాణ ఐఏఎస్ అధికారుల హవా.. ‘టాప్ 100’ జాబితాలో ముగ్గురికి చోటు

అక్షరటుడే వెబ్‌డెస్క్:Telangana IAS Officers|తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌కు జాతీయ స్థాయిలో అరుదైన...

Power Supply Disruption | గాలివాన బీభత్సం.. 24 గంటలుగా విద్యుత్​ లేక అవస్థలు..

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Power Supply Disruption | మండలంలో సోమవారం సాయంత్రం...

Yellareddy Police | అన్నదాత బలవన్మరణం..

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Police | అనారోగ్యంతో రైతు ఉరివేసుకుని బలవన్మరణం...

Stock Market Fall | ప్రారంభ లాభాలు ఆవిరి.. నష్టాలతో ముగిసిన సూచీలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Fall | ఇరాన్‌పై భారీ దాడులను...