అక్షరటుడే, బాల్కొండ: Peacock Hunting Arrest | నెమళ్లను వేటాడిని ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు బాల్కొండ (Balkonda) ఎస్సై యాసిర్ అరాఫత్ వివరాలు వెల్లడించారు.
Peacock Hunting Arrest | ఇండియన్ పెట్రోల్ బంక్ వెనకాల..
ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ వెనకాల నెమళ్లను వేటాడుతున్నారనే సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఓ సంచితో బయటకు వస్తుండగా వారిని విచారించే ప్రయత్నం చేశారు. దీంతో వారు పారిపోతుండగా.. పట్టుకుని వివరాలు సేకరించారు. వారి వద్ద సంచిని తనిఖీ చేయగా రెండు మృతి చెందిన నెమళ్లు లభ్యమయ్యాయి. అనంతరం వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. వేటగాళ్లు నరసింహా, మేరికల్ అంకంరావు, మేకల రామయ్య, మెలిక కళ్యాణ్, మెరిక అంకంరావును అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నెమళ్లను పట్టుకునే జాలిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఐదుగురు వ్యక్తులపై వైల్డ్ లైఫ్ యానిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్ట్ ఆర్మూర్‌లో హాజరుపర్చినట్లు ఎస్సై యాసిర్ అరాఫత్ తెలిపారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Congress | కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం..: ఎమ్మెల్యే భూపతిరెడ్డి