Nizamabad Congress | కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం..: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై పార్టీలో చేరడం అభినందనీయమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: Nizamabad Congress | కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై పార్టీలో చేరడం అభినందనీయమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి అన్నారు. శుక్రవారం డిచ్​పల్లి మండలం (Dichpalli Mandal) మిట్టపల్లి మాజీ సర్పంచ్ గణేష్, రాంపూర్ మాజీ ఎంపీటీసీ లక్ష్మి నారాయణ బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Nizamabad Congress | పార్టీలోకి సాదరంగా ఆహ్వానం..

ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని.. ఆ వాస్తవాలను గుర్తించిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుండగా.. పార్టీ నాయకులు అందరూ ఐక్యంగా ఉంటూ..ప్రభుత్వం అమలు చేస్తున్న.. సంక్షేమ ఫలాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీలో చేరిన గణేష్, లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి అమోఘమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డిచ్​పల్లి మండల అధ్యక్షుడు అంబర్ సింగ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, రామచందర్ గౌడ్, తారాచంద్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Limbadri Narasimha Temple | కోరిన కోరికలు తీర్చే లింబాద్రి నరసింహుడు.. 15 నుంచి గుట్టపై కార్తీక బ్రహ్మోత్సవాలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *