Singur Water Supply | సింగూరు నుంచి రోజు విడిచి రోజు నీటి సరఫరా

ఎల్​నినో ప్రభావంతో సింగూరు జలాశయంలో నీటిమట్టం తగ్గుతున్న నేపథ్యంలో నీటి సరఫరాను రోజు విడిచి రోజు అందించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Singur Water Supply | ఎల్​నినో ప్రభావంతో సింగూరు జలాశయంలో నీటిమట్టం తగ్గుతున్న నేపథ్యంలో నీటి సరఫరాను రోజు విడిచి రోజు అందించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు బాన్సువాడ (Banswada) మిషన్ భగీరథ గ్రిడ్ కార్యనిర్వాహక ఇంజినీర్ ఎస్. స్వప్న సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Singur Water Supply | ఈనెల 28న ఎల్లారెడ్డి, జుక్కల్​..

ఈ నెల 28న ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలకు, 29న బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాలకు నీటిని సరఫరా చేయనున్నట్టుగా పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు తాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, నీటి వృథాను అరికట్టాలని సూచించారు. అలాగే అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ నీటి వనరులను ముందుగానే సిద్ధం చేసుకోవాలని కోరారు. నీటి కొరతను అధిగమించేందుకు ప్రజలందరూ సహకరించాలని ఈఈ ఎస్. స్వప్న విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి..: Seethakka Kamareddy Visit | రేపు కామారెడ్డి జిల్లాకు మంత్రి సీతక్క రాక

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *