అక్షరటుడే, కామారెడ్డి: Seethakka Kamareddy Visit | రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క మంగళవారం కామారెడ్డి జిల్లా (Kamareddy District)కు రానున్నారు. ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
Seethakka Kamareddy Visit | అభివృద్ధి కార్యక్రమాలకు శంకస్థాపనలు..
రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళా సంఘ భవనాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుతో కలిసి మంత్రి ప్రారంభించనున్నారు. అలాగే గిద్ద గ్రామంలో నూతనంగా నిర్మించబోయే సబ్స్టేషన్ పనులకు భూమిపూజ చేయనున్నారు. అక్కడినుంచి సదాశివనగర్ మండలం కుప్రియ, ధర్మారావుపేట, తిమ్మోజీవాడి గ్రామాల్లో నూతనంగా నిర్మించబోయే సబ్స్టేషన్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం బాన్సువాడ నియోజకవర్గంలో మంత్రి పర్యటించనున్నారు.
Seethakka Kamareddy Visit | బాన్సువాడలో..
బాన్సువాడ మండలంలోని కొయ్యగుట్ట తండాలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ, మహిళా సంఘాల భవనాలను మంత్రి ప్రారంభించనున్నారు. బాన్సువాడ పట్టణంలోని 3వ వార్డులో నూతనంగా నిర్మించబోయే మహిళా సంఘ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే బోర్లం గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ సబ్ స్టేషన్ ను మంత్రి ప్రారంభించనున్నారు. ఈ మేరకు మంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు.
ఇది కూడా చదవండి..: Kamareddy ATM Robbery Case | రాజస్థాన్లో చిక్కిన ఏటీఎం చోరీ ముఠా సభ్యుడు.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్